రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. రోజువారి ఆహారంలో ఉడికించిన గుడ్డును తినడం మంచిది. గుడ్డులో ఉన్న పోషకాలు ఎన్నో రకాల జబ్బులకు చెక్ పెడతాయి. ఆరోగ్యాన్ని అందిస్తాయి. పోషకాలకు కేరాఫ్ అడ్రస్ గా గుడ్డును చెప్పొచ్చు. గుడ్డులో ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఒక్క గుడ్డులో ఏడు గ్రాముల ప్రోటీన్, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐదు గ్రాముల కొవ్వు, 75 కేలరీలు, ఐరన్, ఖనిజాలు, విటమిన్స్ మెండుగా ఉంటాయి. అందుకే.. రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ఈ అన్ని రకాల పోషకాలు అందుతాయి.