కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

First Published | Dec 10, 2023, 2:49 PM IST

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలో  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పయనిస్తున్నారు.

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కెవిపి రామచంద్ర రావు ఓ ఆత్మలాగా పనిచేశారో, జగన్ కు విజయసాయి రెడ్డి అలా పనిచేశారని అంటారు. వైఎస్సార్ కాంగ్రెసులో విజయసాయి రెడ్డి కీలకమైన వ్యూహకర్తగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన సూత్రధారిగా విజయ సాయిరెడ్డిని చెప్పుకోవచ్చు..

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల  7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ నెల  7వ తేదీ రాత్రి  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఫామ్ హౌస్  బాత్రూంలో కాలుజారి పడి  గాయపడ్డాడు. దీంతో  కేసీఆర్ ఎడమ కాలి తుంటికి శస్త్రచికిత్స నిర్వహించారు.  హైద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. 


కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

యశోద ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న  కేసీఆర్ ను తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  ఇవాళ  పరామర్శించారు.  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై  కుటుంబ సభ్యులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని  రేవంత్ రెడ్డి  ఆదేశించారు.  కేసీఆర్ త్వరగా కోలుకోని  అసెంబ్లీకి రావాలనే ఆకాంక్షను రేవంత్ రెడ్డి  వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  పార్టీలోని తన ప్రత్యర్థులతో వ్యవహరించిన తీరు అప్పట్లో  చర్చకు దారి తీసింది.  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబానికి అప్పట్లో పొసగకపోయేది.  అయితే  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  పార్టీలోని తన ప్రత్యర్థులతో కూడ కలిసిపోయారు.కోట్ల కుటుంబంతో గతంలో కాకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించారని అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

రాయలసీమలో  బిజ్జం పార్థపార్థసారథి, కాటసాని  రాంభూపాల్ రెడ్డి కుటుంబాల మధ్య వైరం ఉండేది.  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ రాజీ కుదర్చడంలో ఆనాడు సీఎంగా ఉన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా చెబుతారు

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

బిజ్జం పార్థసారథి  రెడ్డి  హైద్రాబాద్ కు పరిమితమయ్యారు.2019 ఎన్నికల ముందు  తిరిగి  నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఎంటరయ్యారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  కోపం నరాన్ని కత్తిరించుకొన్నానని  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  అప్పట్లో  మీడియా ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి తొలుత బీఆర్ఎస్ లో  ఉన్నారు.ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా  పనిచేశారు.  2015లో  తెలంగాణలో  ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసులో  అనుముల రేవంత్ రెడ్డి  అరెస్టయ్యారు.ఆ సమయంలో  కేసీఆర్ సీఎంగా ఉన్నారు

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

బీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్   నివాసంలో  రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని  రేవంత్ రెడ్డి అప్పట్లో  ప్రకటించారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో  కేసీఆర్  సర్కార్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.  అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా  అప్పట్లో  బీఆర్ఎస్ యత్నించింది.  

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.  కాంగ్రెస్ పార్టీలో  సీనియర్లు తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టారు.  అయితే పార్టీలో సీనియర్లను కలుపుకొని వెళ్లారు.  ఎన్నికల సమయంలో  సీనియర్లంతా  ఏకతాటిపైకి వచ్చారు.ఈ విషయమై  కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన సూచనలను కూడ రేవంత్ సహా అంతా పాటించారు. 

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

తెలంగాణ సీఎం పదవిని  కాంగ్రెస్ నాయకత్వం  రేవంత్ రెడ్డికి అప్పగించింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో  సీనియర్లు మంత్రి పదవులు చేపట్టారు. మల్లు భట్టి విక్రమార్కకు  డిప్యూటీ సీఎం పదవిని కేటాయించింది కాంగ్రెస్ నాయకత్వం.

కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

ఇదిలా ఉంటే  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును  సీఎం రేవంత్ రెడ్డి  ఇవాళ పరామర్శించారు. కేసీఆర్  ఆసుపత్రిలో చేరడానికి వచ్చే సమయంలో  గ్రీన్ చానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన  వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీని యశోద ఆసుపత్రికి పంపి  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశించారు. గతంలో  తాను జైలుకు వెళ్లడానికి కారణమైన కేసీఆర్ ను పరామర్శించి  రేవంత్ రెడ్డి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ప్రతీకార చర్యలుండవని ఎన్నికల ముందు ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి  చెప్పారు. 

Latest Videos

click me!