రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

First Published | Dec 11, 2023, 9:47 PM IST

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ఓవైసీ నియామకంపై  బీజేపీ విమర్శలు చేసింది.  కాంగ్రెస్, ఎంఐఎం మధ్య బంధం తేటతెల్లమైందని  బీజేపీ ఆరోపించింది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. 

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి  ప్రొటెం స్పీకర్ పదవిని చేయడంపై  కాంగ్రెస్ ప్రభుత్వంపై  భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తుంది.  అయితే  ఎంఐఎం కు చెందిన అక్బరుద్దీన్ ను  ప్రొటెం స్పీకర్ చేయడం వెనుక  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనే చర్చ కూడ లేకపోలేదు.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

ఈ ఏడాది నవంబర్  30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  64 మంది ఎమ్మెల్యేలతో  అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు స్థానాలే ఆ పార్టీకి ఎక్కువ వచ్చాయి.  కాంగ్రెస్ మద్దతుతో  సీపీఐ అభ్యర్ధి కూడ  ఈ ఎన్నికల్లో విజయం సాధించింది.  దీంతో  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65.  భారత రాష్ట్ర సమితి 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ఎంఐఎం ఏడు స్థానాలు,  బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. 


రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు  ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.  ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లలో  కేసీఆర్ సీఎం అవుతారని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ సర్కార్ ఏడాది కూడ  మనుగడ సాగించడం కష్టమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిస్తే  తెలంగాణ అసెంబ్లీలో  ఈ మూడు పార్టీల బలం  54 అని  కూడ  ఈ రెండు పార్టీల నేతలు వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

ఈ నెల 9వ తేదీన ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేశారు.  కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు.  ఈ నెల  14న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.  వ్యూహాత్మకంగానే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించారనే  ప్రచారం కూడ లేకపోలేదు.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహ సంబంధాలుండేవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో  ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య సంబంధాలు చెడిపోయాయి.  2014 ఎన్నికల్లో  తెలంగాణలో రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది.  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తో ఎంఐఎం స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం


అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో  ఎంఐఎంపై  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడ తీవ్ర విమర్శలు చేశారు.   ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  రేవంత్ రెడ్డి ఎంఐఎంకు స్నేహహస్తం అందించే ప్రయత్నం చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడ  ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ఓవైసీని ఎందుకు చేశారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య  బంధం ప్రొటెం స్పీకర్ నియామకంతో తేలిపోయిందని కిషన్ రెడ్డి  విమర్శలు చేశారు.తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు  మెజారిటీ తక్కువగా ఉంది. దీంతో ఎంఐఎంకు స్నేహ హస్తం అందించే క్రమంలోనే ప్రొటెం స్పీకర్ పదవికి అక్బరుద్దీన్ పేరును ఆ పార్టీ సూచించిందా అనే  చర్చ కూడ లేకపోలేదు.  ఈ  విషయమై కాంగ్రెస్, ఎంఐఎంలపై  బీజేపీ విమర్శలు చేసింది.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలలో  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్. అయితే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున  ప్రొటెం స్పీకర్ గా  నియమించేందుకు నిబంధనలు ఒప్పుకోవు.కేసీఆర్ తర్వాత ఎక్కువ దఫాలు విజయం సాధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. గత టర్మ్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి  స్పీకర్ గా పనిచేశారు.అయితే  పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఎక్కువ దఫాలు విజయం సాధించింది హరీష్ రావు. అయితే హరీష్ రావును కాకుండా  అక్బరుద్దీన్ పేరును సూచించడంపై చర్చ సాగుతుంది.

రేవంత్ చాణక్యం: ఎంఐఎం‌కు కాంగ్రెస్ స్నేహహస్తం

అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా  నియమించడం ద్వారా రాజకీయంగా ముందుచూపుతో  సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారనే  అభిప్రాయాలు కూడ వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ను వ్యూహత్మకంగా చేశారా, అనివార్యంగా చేయాల్సి వచ్చిందా అనే విషయాలను పక్కన పెడితే  ఈ అంశం రాజకీయంగా  చర్చకు దారి తీసింది. 

Latest Videos

click me!