ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

First Published | Nov 5, 2023, 11:07 AM IST

ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో  తమకు కలిసివచ్చిన విషయాలపై  నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తారు.  ప్రతి ఎన్నికల్లో అదే ఆనవాయితీని కొనసాగిస్తారు.

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి  ఓ సెంటిమెంట్ ఉంది.  ఎన్నికల ప్రచార సమయంలో  క్వాలిస్ వాహనాన్ని ఉపయోగిస్తారు.  తొలుత ఎన్నికల సమయంలో క్వాలిస్ వాహనంలో నిర్వహించిన  ప్రచారం కలిసి రావడంతో  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో  ఇదే వాహన్ని రేవంత్ రెడ్డి ఉపయోగిస్తారు. .

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని  జడ్‌పీటీసీ సభ్యుడిగా  తొలుత  రేవంత్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు.  ఆనాడు  కల్వకుర్తి ఎమ్మెల్యే  ఎడ్మ కిష్టారెడ్డికి వ్యతిరేకంగా  కల్వకుర్తి మండలం నుండి  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  రేవంత్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు..ఈ సమయంలో  రేవంత్ రెడ్డి  క్వాలిస్ వాహనాన్ని ఉపయోగించారు

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

కల్వకుర్తి నియోజకవర్గంలోని జడ్పీటీసీ  ఎన్నికల్లో టీడీపీ సహా ఇతర పార్టీలు కూడ  రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించాయి. జడ్పీటీసీగా విజయం సాధించిన తర్వాత  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ  రేవంత్ రెడ్డి  బరిలో నిలిచారు. ఈ సమయంలో  రేవంత్ రెడ్డి విజయం సాధించారు.ఈ ఎన్నికల సమయంలో  కూడ  రేవంత్ రెడ్డి క్వాలిస్ వాహనాన్ని ఉపయోగించారు.  ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. 

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

2009 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగి విజయం సాధించారు.  కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి  పలు దఫాలు విజయం సాధించిన  గుర్నాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు రేవంత్ రెడ్డి.

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

ఈ సమయంలో కూడ  రేవంత్ రెడ్డి ఇదే వాహనంలో ప్రచారం నిర్వహించారు. 2014, 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేశారు.  2014లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.  2019లో  మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడ  క్వాలిస్ వాహనంలోనే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. ఈ వాహనంలో  వెళ్లి ప్రచారం నిర్వహిస్తే  కలిసి వస్తుందని ఆయన నమ్ముతారు.   

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

ఈ దఫా ఎన్నికల్లో కొడంగల్ నుండి  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. కొడంగల్ తో పాటు  కామారెడ్డి నుండి కూడ  రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు.  కామారెడ్డి నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. 

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

కామారెడ్డి నుండి  తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. దీంతో  కామారెడ్డి నుండి  కేసీఆర్ పై  కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతుంది కాంగ్రెస్.

Latest Videos

click me!