Published : Mar 15, 2025, 09:30 AM ISTUpdated : Mar 17, 2025, 09:47 AM IST
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మహిళలను దృష్టిలో పెట్టుకొని పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగాన్ని పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యువ వికాసం స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూలీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంతకీ ఏంటీ యువ వికాసం పథకం.? దీనికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
23
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు లబ్ధి చేకూరే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్ఠంగా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. కార్పొరేషన్ల సహాకారంతో ఈ పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఈరోజు (శనివారం) నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.
33
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు అందించనున్నట్లు తెలుస్తోంది. శనివారం విడుదల చేసే నోటిఫికేషన్‌లో పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అందించనున్నారు. ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అందిస్తారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.
ఎలా ఎంపిక చేస్తారు.?
రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథ కం ద్వారా ఒక్కో జిల్లాకు కనీసం 10వేల మందికి ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నిరుద్యోగులు ఎంచుకునే యూనిట్ల ఆధారంగా రేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. కాగా పథకంలో ఏయే యూనిట్టు ఉండాలనే విషయంపై కూడా అధికారులు కసరత్తు చేశారు. వీటన్నింటికీ సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు.