Gali Janardhan Reddy
ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన రెడ్డితో పాటు ఆయన కుమారుడు కిరీట్ రెడ్డి, కూతురు బ్రాహ్మణి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పు పట్టిపోతాయంటూ గాలి జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు
Gali Janardhan Reddy
అసలేంటీ కేసు.?
గనుల అక్రమ తవ్వకాల ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో గాలి జనార్దన్‌రెడ్డితోపాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిలు మంజూరు చేసింది.
gali janardhan reddy
ఓఎమ్‌సీ కేసు ఏళ్ల తరబడి కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలసుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసింది. 2011 సెప్టెంబర్ 5న ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో 53 కిలోలున్న సుమారు 105 బంగారు ఆభరణాలు, నగదు, బాండ్లను సీబీఐ సీజ్ చేసింది. బాండ్లను విడుదల చేయొద్దంటూ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కు లేఖ రాసింది.