తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ .. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రైల్వే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ .. ఫుల్ డిటెయిల్స్

Published : Oct 31, 2025, 01:06 PM ISTUpdated : Oct 31, 2025, 01:19 PM IST

RRB Recruitment Notification 2025 : రైల్వేలో ఉద్యోగం.. అదీ సొంతరాష్ట్రంలో… తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు ఇంకేం కావాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భారీగాా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

PREV
18
రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Railway Jobs : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలామంది యువతీయువకుల కల... ఇందుకోసమే ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంటారు. అయితే కొందరు ప్రత్యేకంగా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసమే ప్రయత్నిస్తుంటారు... ఇలాంటివారికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి మీకు తగిన అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.. మీరు కలగనే రైల్వే ఉద్యోగాన్ని పొందండి.

28
RRB భర్తీచేయనున్న ఉద్యోగాలివే...

భారతీయ రైల్వేలో తాజా నోటిఫికేషన్ ద్వారా 2,569 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) లాంటి పోస్టులున్నాయి.

కేవలం సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, విజయవాడ, నాందేడ్) పరిధిలో మొత్తం 103 ఉద్యోగాలున్నాయి. ఇందులో రిజర్వేషన్ల వారిగా ఖాళీలను పరిశీలిస్తే…

అన్ రిజర్వుడ్ - 50

ఎస్సి - 13

ఎస్టి - 08

ఓబిసి - 15

ఈడబ్ల్యూఎస్ - 17

38
రైల్వే రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం : 31 అక్టోబర్ 2025.

దరఖాస్తుకు చివరి తేదీ : 30 నవంబర్ 2025.

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ : 02 డిసెంబర్ 2025.

దరఖాస్తు సవరణ : 03 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్ వరకు.

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31 అంటే ఇవాళ్టి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం చేయాలి... ఆఫ్ లైన్ ఎలాంటి ఫీజు అంగీకరించబడవని RRB చెబుతోంది.

48
వయో పరిమితి

అభ్యర్థులు 18-33 ఏళ్ల మధ్య వయసు కలిగివుండాలి. (జనవరి 1, 2026 నాటికి వయసు పరిగణలోకి తీసుకుంటారు).

రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్, వితంతు మహిళలకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

58
విద్యార్హతలు

1. జూనియర్ ఇంజనీర్ (JE) : ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్, సైన్స్ ఆండ్ టెక్నాలజీలో డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసివుండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థల నుండి పూర్తిచేసివుండాలి.

2. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసివుండాలి.

3. కెమికల్ సూపర్వైజర్ ఆండ్ మెటలర్జీకల్ సూపర్వైజర్ : ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో పాసైఉండాలి.

68
దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు తమ జోనల్ RRB అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ఇతరులకు రూ.500

ఎస్సి/ఎస్టి/ మైనారిటీలు/ ఈడబ్ల్యుయూఎస్/ మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్స్/పిడబ్ల్యుడి/ట్రాన్స్ జెండర్స్ రూ.250.

CBT-1 పరీక్షకు హాజరైతే ఈ దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లిస్తారు.

78
అభ్యర్థుల ఎంపిక విధానం

మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి రెండు దశల్లో రాత పరీక్ష (కంప్యూటర్ బెస్డ్ ఎగ్జామ్) ఉంటుంది.

1. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)

2. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2)

3. ధ్రువపత్రాల పరిశీలన

4. వైద్య పరీక్ష

88
సాలరీ

జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ ఆండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగులకు ప్రారంభ జీతం రూ.35,400 (లెవల్ 6) ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories