తెలంగాణపై కాంగ్రెస్ కన్ను: పీసీసీపై పక్కా ప్లాన్, కసరత్తు చేస్తున్న రాహుల్

First Published Mar 6, 2021, 4:17 PM IST

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  పీసీసీ చీఫ్ పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం కసరత్తు చేస్తోంది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ నాయకత్వం ఓ అంచనాకు వచ్చిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలను సాధించలేదు. రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకొంది.
undefined
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు కూడ అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసేందుకు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను కూడ సేకరించారు.
undefined
ఈ అభిప్రాయాల ఆధారంగా పీసీసీ చీఫ్ ప్రకటించే సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించాలని జానారెడ్డి అధిష్టానానికి సూచించారు. దీంతో అధిష్టానం కూడ జానారెడ్డి అభిప్రాయంతో కొత్త చీఫ్ ప్రకటనను వాయిదా వేసింది.
undefined
మాజీ ఎంపీ, ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ శుక్రవారం నాడు రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ సరైన రీతిలో పోరాటం చేయడం లేదని రాహుల్ గాంధీ యాష్కీతో అన్నట్టుగా సమాచారం.
undefined
పార్టీ నేతలు టీఆర్ఎస్ ను ఎండగట్టేందుకు సీరియస్ గా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు.పార్టీ భవిష్యత్తును ఫణంగా పెట్టొద్దని కూడ రాహుల్ గాంధీ యాష్కీ వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది.
undefined
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులను కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోందని సమాచారం. సామాజిక వర్గాల వారీగా సమతుల్యం పాటిస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఎఐసీసీ భావిస్తోంది.
undefined
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన పట్టును పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ కు ఇబ్బందిని కల్గిస్తోంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టాలంటే రాజకీయంగా కాంగ్రెస్ బలపడాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి.
undefined
దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో బలపడేందుకు అవసరమైన ప్రణాళికను అమలు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగానే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
undefined
పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకెళ్లే నాయకత్వాన్ని ఇవ్వాలని ఎఐసీసీ నేతలు భావిస్తున్నారు. వరుస పరాజయాలతో నిస్తేజంలో క్యాడర్లో ఉత్తేజం నింపే దిశగా నియామకాలు ఉండే అవకాశాలు లేకపోలేదు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. ఈ ఎన్నికలు పూర్తైన తర్వాత టీపీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉంది.గతానికి భిన్నంగా పీసీసీ చీఫ్ ఎంపిక ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
undefined
click me!