నాగార్జునసాగర్‌పై కేసీఆర్ ఫోకస్: స్థానిక నేతలకు ఫోన్, ధీటైన అభ్యర్ధి కోసం సర్వే

First Published Mar 5, 2021, 12:59 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. 

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కేంద్రీకరించారు. ఈ స్థానం నుండి బరిలో దింపే అభ్యర్ధి కోసం గులాబీ బాస్ దృష్టి పెట్టారు. ఈ విషయమై స్థానిక నేతలతో గులాబీ దళపతి ఫోన్ లో చర్చించారు.
undefined
2020 డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించాడు. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
undefined
గత ఏడాదిలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయంపాలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ బీజేపీ అనుహ్యఫలితాలను సాధించింది. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని అభ్యర్ధిగా బరిలోకి దింపింది. జానారెడ్డి ఈ స్థానం నుండి ఏడు దపాలు విజయం సాధించాడు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ కు 48 శాతం మద్దతు ఉందని సీఎం కేసీఆర్ ఇటీవల మంత్రుల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
undefined
స్థానికేతరుడైన నోముల నర్సింహ్మయ్య నాగార్జునసాగర్ నుండి గత ఎన్నికల్లో విజయం సాధించాడు. 2014 లో ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు.
undefined
ఈ ఉప ఎన్నికల్లో పోటీకి నర్సింహ్మయ్య తనయుడు భగత్ కూడా ఆసక్తిగా ఉన్నాడు. అయితే టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు కూడ ఈ స్థానంలో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. అభ్యర్ధి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చీఫ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
undefined
నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో సీఎం కేసీఆర్‌ తలమునకలయ్యారు. వారం రోజులుగా నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలకు కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి వివరాలు సేకరించారు.
undefined
త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్‌యాదవ్‌, కట్టెబోయిన గురవయ్య యాదవ్‌లకు సీఎం ఫోన్‌ చేసి మాట్లాడారు.
undefined
ముగ్గురి నేతల నుండి కేసీఆర్ పలు విషయాలను అడిగి తెలుసుకొన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలను కూడ ఆయన తెలుసుకొన్నారు.
undefined
జానారెడ్డి పరిస్థితి ఏమిటీ, యాదవ సామాజిక వర్గం నుండి ఇతర పార్టీలు సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడ కేసీఆర్ వారిని అడిగి తెలుసుకొన్నారు.
undefined
టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత తన అభ్యర్ధిని ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
undefined
click me!