టీపీసీసీ చీఫ్‌ మార్పుపై మరోసారి చర్చ: కొత్త సారధి వచ్చేనా?

First Published Dec 3, 2020, 2:50 PM IST

టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త సారధి ఎంపికపై మరోసారి చర్చ సాగుతోంది. వరుస  ఓటముల నేపథ్యంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ చేసే నేతలు పెరిగిపోయారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.టీపీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొంత కాలం క్రితం ఎఐసీసీకి లేఖ రాశాడు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తర్వాత పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
undefined
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఆ పార్టీ క్యాడర్ ను తీవ్ర నిరాశలో ముంచెత్తింది.ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు కనీసం డిపాజిట్ కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలు కారణాలను చెబుతున్నారు.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే పీసీసీ చీఫ్ మార్పు కోసం డిమాండ్ విన్పించే అవకాశం లేకపోలేదు. 2014 ఎన్నికల నుండి వరుస ఓటములు ఆ పార్టీని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టాయి. పార్టీ నుండి కొందరు నేతలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరడం కూడ ఆ పార్టీని కలవరపరుస్తోంది.
undefined
దీంతో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ కొంతకాలంగా బలంగా విన్పిస్తోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో ఈ ప్రచారాన్ని కమలం నేతలు మరింత విస్తృతం చేశారు.
undefined
దీంతో పీసీసీ నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ ను నేతలు మరోసారి ఎత్తే అవకాశం లేకపోలేదు. పార్టీని సమర్ధవంతంగా నడిపే నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని కూడా కొందరు పార్టీ నేతలు ఎఐసీసీని కోరుతున్నారు.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలకు ముందే ఉత్తమ్ ను మార్చాలని ఎఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ డిమాండ్ చేశారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు రాకపోతే ఈ డిమాండ్ ను విన్పించే నేతలు మరికొందరు యాష్కీకి జత కలిసే అవకాశం లేకపోలేదు.
undefined
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం ఆసక్తిని కనబరుస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడ పీసీసీ చీఫ్ పదవి కోసం విన్పిస్తోంది. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొనే నేతగా శ్రీధర్ బాబుకు పేరుంది. దీంతో శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలనే కోరే వారు కూడ లేకపోలేదు.
undefined
రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 48 కార్పోరేటర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ ఎన్ని డివిజన్లలో విజయం సాధిస్తోందో మరికొన్ని గంటల్లో తేలనుంది.పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది నేతల మధ్య పోటీ ఉంది. అయితే పార్టీ నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తోందనేది తేలాల్సి ఉంది.
undefined
click me!