Real estate: హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతంలో త‌క్కువ ధ‌ర‌కే అపార్ట్‌మెంట్స్‌.. రేప‌టి కోసం మంచి ప్లానింగ్

Published : Sep 17, 2025, 02:15 PM IST

Real estate: రోజురోజుకీ హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ పెరుగుతోంది. కొత్త కొత్త ప్రాంతాల్లో అమ్మ‌కాలు జోరందుకుంటున్నాయి. తాజాగా హైద‌రాబాదీల‌కు కొత్త రియ‌ల్ డెస్టినేష‌న్ దొరికింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పోచారం బెస్ట్ ఆప్ష‌న్

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనాలనుకునే వారు ఎక్కువగా వెస్ట్ హైదరాబాద్ వైపు చూస్తారు. కానీ అక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో ఈస్ట్ హైదరాబాద్‌లోని పోచారం మంచి ఆప్షన్‌గా మారింది. ఐటీ కంపెనీలు పెరుగుతున్న ఈ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేస్తే పెట్టుబడి, రెంటల్ ఇన్‌కమ్ పరంగా లాభదాయకంగా ఉంటుంది.

25
వెస్ట్ హైదరాబాద్‌లో భారీగా ధరలు

గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చదరపు అడుగుకి ₹11,000 – ₹12,000 వరకు ఉన్నాయి. సాధారణ మధ్యతరగతి వారికి ఈ ధరలు భారమ‌ని చెప్పాలి. దీంతో కొత్త‌గా ప్లాట్స్ కొనుగోలు చేసే వారికి ఈస్ట్ హైద‌రాబాద్ బెస్ట్ ఆప్ష‌న్‌గా నిలుస్తోంది.

35
పోచారంలో తక్కువ ధరలు

ఈస్ట్ హైదరాబాద్‌లోని పోచారంలో మాత్రం ఫ్లాట్లు ఇంకా సరసమైన రేట్లకే లభిస్తున్నాయి. ఇక్కడ ప్రాజెక్టుల ధరలు చదరపు అడుగుకి ₹5,000 – ₹5,500 మాత్రమే. ఈ ధరలు రెండు మూడు ఏళ్లలో పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు కొనుగోలు చేయడం పెట్టుబడి దృష్ట్యా మంచిదని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

45
పెరిగిన ర‌వాణా స‌దుపాయాలు

ప్రస్తుతం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి పోచారం చేరుకోవడానికి కనీసం అరగంట పడుతోంది. ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకా ఎక్కువ సమయం అవుతుంది. అయితే ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత ఈ ప్రయాణం చాలా సులభమవుతుంది. అప్పుడు ఉప్పల్ నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

55
పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారికి

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారికి పోచరం మంచి ఆప్ష‌న్‌గా భావిస్తున్నారు. పోచారంలో ఐటీ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇక్కడ ఫ్లాట్లు కొంటున్నారు. ధరలు ఇంకా తక్కువగా ఉన్నందున, ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టుల్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. రెంటల్ ఇన్‌కమ్ కూడా స్థిరంగా ఉంటుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు. ఆ రంగంలో నిపుణులను సంప్ర‌దించ‌డంతో పాటు నేరుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories