PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్

Published : Jun 20, 2026, 06:36 PM IST

కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు రూ.6,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అనే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

PREV
15
గర్భిణులకు కేంద్ర ప్రభుత్వ సహాయం
గర్భధారణ సమయంలో మహిళలు ఆదాయం కోల్పోకుండా, తల్లి-బిడ్డ పోషణకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 'ప్రధాన మంత్రి మాతృ వందన యోజన' (PMMVY)ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
25
ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణులకు రెండు విధాలుగా ఆర్థిక సాయం అందిస్తారు. 

మొదటి కాన్పు (మొదటి బిడ్డ) 

మొదటి బిడ్డకు మొత్తం రూ.5,000 రెండు విడతల్లో ఇస్తారు. మొదటి విడత రూ.3,000 గర్భం దాల్చిన వెంటనే రిజిస్టర్ చేయించుకుని, కనీసం ఒకసారి యాంటెనాటల్ చెకప్ చేయించుకున్న తర్వాత ఇస్తారు. 

రెండో విడత రూ.2,000 బిడ్డ పుట్టినట్లు రిజిస్టర్ చేసి, 14 వారాల్లోపు ఇవ్వాల్సిన మొదటి దశ టీకాలు వేయించిన తర్వాత ఇస్తారు. 

రెండో కాన్పు (ఆడపిల్ల పుడితే)

ఆడపిల్లల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం పెంచారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో రూ.6,000 నేరుగా అందిస్తారు.

35
ఈ పథకానికి ఎవరు అర్హులు?

19 ఏళ్లు పైబడిన గర్భిణులు, పాలిచ్చే తల్లులు అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి లేదా దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉండాలి. MGNREGA జాబ్ కార్డ్, ఇ-శ్రమ్ కార్డ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు లేదా ఇప్పటికే వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ప్రయోజనాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

45
ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే ఏమేం పత్రాలు కావాలి?

తల్లి ఆధార్ కార్డు (ప్రస్తుత నిబంధనల ప్రకారం భర్త ఆధార్ తప్పనిసరి కాదు).

ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా పుస్తకం కాపీ.

తల్లి-బిడ్డ సంరక్షణ కార్డు (MCP Card - మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్‌తో).

బిడ్డ జనన ధృవీకరణ పత్రం, టీకా కార్డు (రెండో విడతకు మాత్రమే).

55
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీకు దగ్గర్లోని అంగన్‌వాడీ కేంద్రం (Anganwadi Centre) లేదా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) నేరుగా వెళ్లవచ్చు. అక్కడి అంగన్‌వాడీ సిబ్బంది లేదా ఆశా (ASHA) కార్యకర్తల దగ్గర అప్లికేషన్ ఫారం తీసుకుని సరైన వివరాలతో నింపాలి… అవసరమైన పత్రాలను సమర్పించాలి. 

అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం pmmvy.wcd.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ 'Citizen Login' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ వివరాలు నింపి, అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. బిడ్డ పుట్టిన 270 రోజులలోపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.

Read more Photos on
click me!

Recommended Stories