పెద్దపల్లి రోడ్డుప్రమాదం... మంథని టీఆర్ఎస్ బడా నేత, బంధువులే కారణమా?

First Published Oct 6, 2021, 12:38 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనికి కూతవేటు దూరంలో ఆర్టిసి బస్సు, కారు ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన ఒకరు మృత్యువాతపడగా పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు అధికార టీఆర్ఎస్  పార్టీ నేత, ఆయన బంధువులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తున్నారు. 

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఆర్టిసి బస్సు-కారు ఢీకొని లోయలోకి దూసుకెళ్ళగా ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వారు కూడా గాయపడ్డాడు. ఈ ప్రమాదం మంథని నియోజకవర్గంలోని గాడుదుల గండిగుట్ట టర్నింగ్ పాయింట్ వద్ద జరిగింది.  
 

peddapalli ప్రమాదానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అడ్డూఅదుపు లేకుండా చేపట్టిన మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంథనికి చెందిన ఓ కీలక TRS నేత బంధువులు మైనింగ్ కారణంగా  గాడుదుల గండిగుట్ట అనేదే లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. 

ఇక ఇదే టీఆర్ఎస్ నేత ఇసుక దందా కూడా ఈ రోడ్లమీదే జోరుగా సాగుతుందని ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలు అధికలోడ్ తో తిరగడం వల్ల మంథని నుండి కాటరం వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారట. ఈ ప్రమాదానికి కారణం కూడా రోడ్ల దుస్థికి కూడా ఓ కారణమని అంటున్నారు. 
READ MORE  రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన బస్సు, కారు డ్రైవర్ మృతి

ఆర్టిసి బస్సు-కారు ఢీకొన్న తర్వాతకూడా  అక్కడే ఆగిపోకుండా లోయలోకి దూసుకుపోయాయి. దీంతో కారు తుక్కుతక్కయి డ్రైవింగ్ సీట్ లో వున్న తాటి వినీత్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు గాయపడ్డారు 

ప‌ర‌కాల డిపో బ‌స్సు లోయ‌లో ప‌డిన ఘ‌ట‌న‌పై ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బెల్లంప‌ల్లి నుంచి హ‌నుమ‌కొండ వెళ్తున్న బ‌స్సు  ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న విచారం వెల్లబుచ్చారు. 

ఈ ప్రమాదంలో గాయ‌ల‌కు గురైన బ‌స్సులోని ప్ర‌యాణీకుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందే విధంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి ఆదేశించారు. క్ష‌త‌గాత్రులకు కావ‌ల్సిన వైద్య సేవ‌ల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాల‌కు గురైన ప్ర‌యాణీకులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ  బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు విచారం వ్య‌క్తం చేశారు మంత్రి పువ్వాడ. 

click me!