Huzurabad Bypoll: బిడ్డా కేసీఆర్... నువ్వు మాడి మసైపోతావు జాగ్రత్త: ఈటల ఘాటు వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Sep 30, 2021, 01:16 PM ISTUpdated : Sep 30, 2021, 01:20 PM IST

హుజురాబాద్ ఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ బిజెపి నాయకులు ఈటల రాజేందర్ మాటల ఘాటు మరింత పెంచుతున్నారు. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ పై ఘాటూ విమర్శలతో విరుచుకుపడ్డారు.

PREV
112
Huzurabad Bypoll: బిడ్డా కేసీఆర్... నువ్వు మాడి మసైపోతావు జాగ్రత్త: ఈటల ఘాటు వ్యాఖ్యలు

కరీంనగర్: ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన తనమీదే అధికార టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ఆరోపించారు.  దొంగ సంతకాలతో దొంగ లెటర్స్ సృష్టించి తప్పుడు ప్రచారానికి తెరలేపిందని అన్నారు. దళిత బంధును బంద్ పెట్టాలి... ఈటల రాజేందర్ ను బొంద పెట్టాలని చూస్తున్నారని అన్నారు.  దొంగ లెటర్స్ సృష్టించి కాదు.. ధీరుడవు అయితే నిజాయితీగా కొట్లాడు అని ఈటల హెచ్చరించారు. 

212

హుజూరాబాద్ మండలంలోని సిర్శపల్లిలో ఎన్నికల మాజీ మంత్రి ఈటల బిజెపి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం కోసం గ్రామానికి చేరుకున్న ఈటలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనమెత్తి, బతుకమ్మ, కొలాటాలతో ఈటలకు స్వాగతం పలికారు. గ్రామంలో ఈటల బీజేపీ జెండా ఎగురవేసారు. 
 

312

ఈ సందర్భంగా ఈటల మాట్లాడులూ... దళిత బంధు అందరికీ అందించాలని మరో మారు డిమాండ్ చేశారు. కేవలం దళితులకు కాకుండా ఇతర కులాలు, మతాల్లోని పేదలందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

412

''దాహం వేసినప్పుడే బాయి తవ్వుకునేవాడు కేసిఆర్. ఎన్నికలప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారు... అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. 5 నెలలుగా హుజూరాబాద్ తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదు. వరదల గురించి మాట్లాడడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడు. నిరుద్యోగ భృతి ఇవ్వడు. ప్రగతి భవన్ లో కూర్చొని ప్రజల కోసం ఏ పనీ చెయ్యడు...కానీ కుట్రలు చేస్తాడు. ఈటెలను అవమానించడం, బొందపెట్టడమే ఇప్పుడు ఆయన పని'' అని విరుచుకుపడ్డారు. 

512

''నేను కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని, బాధితులను కాపాడాలని పని చేశా... శక్తివంచన లేకుండా పనిచేస్తున్న నాక మంచి పేరు వచ్చిందని రగిలిపోయిన కేసీఆర్ భూకుంభకోణం చేసానని ఆరోపించి బయటికి పంపిండు. తప్పు చేస్తే నేను ఏ శిక్షకు అయినా సిద్ధమే. కానీ నేనే తప్పు చేయలేదు'' అని ఈటల అన్నారు.
 

612

''సిగ్గుమాలిన, దరిద్రపు ముఖ్యమంత్రి కెసిఆర్. ఆయన రాజకీయ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు... దాంట్లోనే నువ్వు కూడా మాడి మసి అయిపోతావు బిడ్డా'' అంటూ మరోసారి కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

712

''సీఎం కుర్చీకి ఎసరు పెట్టేది హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ తప్ప మేము కాదు... మేము కేవలం మమ్మల్ని మనిషిలాగా చూడమని కోరాం. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు, ఒక్క రోడ్డు వెయ్యలేదు అని హరీష్ అనడం కరెక్టేనా... అబద్దాల కోరు హరీష్. వారి జీవితమే అబద్దాలమయం'' అని మండిపడ్డారు.

812

''రాజేందర్ తల ఎత్తుతుండని నరకాలని చూస్తున్నారు. దళిత బంధు, గొర్లు, పెన్షన్, పావలా వడ్డీ 2017-18 నుండి రాలేదు... ఇప్పుడు ఎవరి వల్ల వచ్చాయో గుర్తు పెట్టుకోండి. నన్ను మర్చిపోకండి'' అని ఓటర్లను కోరారు ఈటల.
 

912

''నా పక్కన ఉన్నవారు అటు పోయారు... వారి సోకులకు, మీ డబ్బులకు కారణం నేను.  అన్నం పెట్టిన వారికి సున్నం పెడుతున్నారు. నేను మీకు అవకాశమిచ్చ గెలిపించా. కాబట్టి ఆలోచించి పనిచేయండి'' అని సూచించారు. 

1012

'' కేసిఆర్, అయన బిడ్డ, కొడుకు కూలి పని చేసి, వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు కాదు... ఇక్కడ పంచుతున్నదంతా అక్రమ సంపాదనే. వారిచ్చే డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకు వేయండి'' అని ఈటల సూచించారు.

1112

''ద్రోహుల, బ్రోకర్ల మాట వినకండి. ఇది కులాల మధ్య లొల్లి కాదు. నేను పొత్తుల సద్దిని.  కులాల, మతాలకు నేను వ్యతిరేకం కాదు కేవలం కేసిఆర్ అహంకారానికి వ్యతిరేకం. నేను గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హుజురాబాద్ ప్రజల చైతన్యం గెలిచినట్టు'' అని ఈటల అన్నారు.

1212

ఈటల వెంట మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగ శోభ, బీజేపీ మండల అధ్యక్షుడు రావుల కుమార్, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ తుల ఉమ, ఓయూ జేఏసి నేత సురేష్ యాదవ్, సిర్శపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, లింగరావు, రామరాజు, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

click me!

Recommended Stories