Prayagraj Kumbh Mela 2025 : ప్రస్తుతం యావత్ భారతీయుల అడుగులు ప్రయాగరాజ్ వైపే సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమం మహా కుంభమేళా ప్రయాగరాజ్ లో అట్టహాసంగా సాగుతోంది. 144 ఏళ్లతర్వాత జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనాలని... పవిత్ర త్రివేణం సంగమంలో అమృతస్నానం చేయాలని మెజారిటీ హిందువులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు పయనం అవుతున్నారు.
దేశ విదేశాల నుండి కుంభమేళాకు భక్తులు, పర్యాటకులు హాజరవుతున్నారు. ఇప్పటికే కుంభమేళా ప్రారంభమై నెలరోజులు కావస్తోంది. ఇంకో 20 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 38 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానం చేసారు. మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి 45 నుండి 50 కోట్లమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది కుంభమేళాకు వెళుతున్నారు. రైళ్లు, బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు, విమానాల్లో ఎలా కుదిరితే అలా ప్రయాగరాజ్ వెళుతున్నారు. కుటుంబసభ్యులతో కొందరు, స్నేహితులతో ఇంకొందరు వెళుతున్నారు... గ్రామాలు, కాలసీవాసులు, చుట్టుపక్కల ఇళ్లవారు ఇలా దేశంలోని సగం జనాభా ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొంటోంది.
ఇప్పుడున్న తరం జీవితంలో ఒక్కసారే ఇలాంటి మహత్కార్యంలో పాల్గొనేది. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు,వ్యవసాయ పనులు...ఇలా వివిధ కారణాలతో కొందరు కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటివారికి ఏసియా నెట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. మీ ఇంటివద్దే వుండి ప్రయాగరాజ్ కుంభమేళా ప్రసాదం, త్రివేణి సంగమ పవిత్ర నీటిని పొందే ఏర్పాటుచేసింది. మీరు కూడా వీటిని పొందవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.