Hyderabad : దిగొచ్చిన కూరగాయల ధరలు ... దేని ధర ఎంతో తెలుసా?

Published : Feb 05, 2025, 06:00 AM IST

హైదరాబాద్ లో కూరగాయల ధరలు కాస్త తగ్గాయి. కొద్దిరోజుల కింద కిలో రూ.100 పైనే వున్న టమాటా, ఉల్లి ధరలతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా తక్కువగానే వున్నాయి. ఏ కూరగాయ ధర ఎంతుందో చూద్దాం.     

PREV
15
Hyderabad : దిగొచ్చిన కూరగాయల ధరలు ... దేని ధర ఎంతో తెలుసా?
Vegetables price in Hyderabad

వంటకాలకు రుచినిచ్చేవి కూరగాయలు. టమాటా, ఉల్లి లేకుండా రుచికరమైన వంటలు చేయడం కష్టం. అందుకే మార్కెట్లో ఇతర కూరగాయల కంటే టమాటా, ఉల్లిపాయలనే ఎక్కువగా కొంటారు. రసం నుండి బిర్యానీ వరకు వీటి అవసరం ఎక్కువ. ధరలు తగ్గితే బుట్టలు బుట్టలుగా కొనుగోలు చేస్తారు. గత కొన్ని నెలలుగా వీటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 

25
Vegetables price in Hyderabad

ఒకానొక దశలో టమాటా, ఉల్లి ధరలు కిలో రూ.100 వరకు చేరాయి. దీంతో కిలోల కొద్దీ కొనేవారు సైతం అరకిలో, పావుకిలోకే పరిమితం అయ్యారు. డిసెంబర్ చివరి నుండి టమాటా, ఉల్లి సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ.15-20, ఉల్లి రూ.25-35కి దొరుకుతున్నాయి. దీంతో కొనుగోళ్లు పెరిగాయి.

35
Vegetables price in Hyderabad

ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లలో పెద్ద ఉల్లి రూ.30-40, చిన్న ఉల్లి రూ.70, టమాటా రూ.15-25, బీట్రూట్ రూ.30-40, బంగాళాదుంప రూ.30, కాకరకాయ రూ.40కి లభిస్తున్నాయి.

అయితే పచ్చిమిర్చీ ధర మాత్ర కాస్త ఎక్కువగా వుంది. మంచి పచ్చిమిర్చీ రూ.50-60 కి కిలో వుంది. ఇక క్యారెట్ కూడా రూ.60‌-70 కి కిలో వుంది. బెండకాయ కూడా కిలో రూ.50 వరకు వుంది. 

45
Vegetables price in Hyderabad

అరటికాయ రూ.10-15,  సొరకాయ రూ.25, బఠానీ రూ.30, క్యాబేజీ రూ.15,  కాలీఫ్లవర్ రూ.20 కి కిలో వున్నారు.  బీన్స్ రూ.70 చిక్కుడుకాయ రూ.55కి కిలో అమ్ముతున్నారు.

55
Vegetables price in Hyderabad

దోసకాయ రూ.20, మునక్కాయ రూ.100, వంకాయ రూ.30, బీన్స్ రూ.40, అల్లం రూ.50, బెండకాయ రూ.30, గుమ్మడికాయ రూ.25, ముల్లంగి రూ.15, బీరకాయ రూ.40, పొట్లకాయ రూ.40కి అమ్ముతున్నారు.

గమనిక : హైదరాబాద్ లో చాలా కూరగాయల మార్కెట్లు వున్నాయి. ప్రాంతాన్ని బట్టి కొన్ని కూరగాయల ధరలు మారుతుంటాయి. 
 

click me!

Recommended Stories