ట్రావెల్ వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ తాజాగా తీవ్ర వివాదాల కేంద్రంగా మారాడు. సోషల్ మీడియాలో హిందూ దేవతలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. , అశ్లీల సంకేతాలతో కూడిన వీడియోలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ యాత్రల పేరుతో వీడియోలు చేసిన అన్వేష్, ఇప్పుడు వివాదాస్పద కంటెంట్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు.
25
దర్యాప్తు వేగం పెంచిన పంజాగుట్ట పోలీసులు
అన్వేష్ వ్యాఖ్యలపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇన్‌స్టా నిర్వాహకులకు అధికారిక లేఖ పంపారు. అక్కడి నుంచి స్పందన వచ్చిన వెంటనే నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. సహకరించకపోతే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశముందని సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు.
35
కరాటే కళ్యాణి ఫిర్యాదుతో
హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడాడంటూ సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా BNS సెక్షన్ 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇదే తరహా ఫిర్యాదులు ఖమ్మం, విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. పలువురు బీజేపీ నేతలు అన్వేష్ అరెస్ట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అన్వేష్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. “బాయ్‌కాట్ అన్వేష్” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్న అతడిని ఇప్పుడు పెద్ద సంఖ్యలో అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. ప్రేక్షకులే కంటెంట్ క్రియేటర్‌ను పైకి తీసుకెళ్తారని, అదే ప్రేక్షకులే పతనానికి కారణమవుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.
55
అన్వేష్ వీడియోలపై తీవ్రమైన ఆరోపణలు
విదేశీ ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనను ప్రోత్సహించేలా వీడియోలు చేయడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అన్వేష్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు. కొన్ని ఆడియో క్లిప్స్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. సమాజానికి హానికరమైన కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.