భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు

First Published | Aug 22, 2023, 11:06 AM IST

టిక్కెట్టు దక్కని బీఆర్ఎస్ నేతలు భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు.
 

భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు

బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని నేతలు భవిష్యత్తు కార్యాచరణపై వ్యూహ రచన చేస్తున్నారు. కొందరు నేతలు  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తమకు కాకుండా  తమ ప్రత్యర్థులకు  టిక్కెట్లు దక్కడంపై  ఆందోళన చేస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్  ఈ నెల  21న  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.నాలుగు స్థానాలు మినహా  మిగిలిన  115 అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థులను  కేసీఆర్ విడుదల చేశారు.  ఈ జాబితాలో  చోటు దక్కని  అసమ్మతి నేతలు  భవిష్యత్తు కార్యాచరణను సిద్దం  చేసుకుంటున్నారు.  

భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  నకిరేకల్  అసెంబ్లీ స్థానం నుండి  చిరుమర్తి లింగయ్యకు  బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది.  ఈ స్థానం నుండి  వేముల వీరేశం టిక్కెట్టు ఆశించారు. కానీ  చిరుమర్తి లింగయ్యకే టిక్కెట్టు దక్కడంతో  వేముల వీరేశం  నిన్న తన అనుచరులతో  సమావేశమయ్యారు. నకిరేకల్ నుండి పోటీ చేసేందుకు  వీరేశం   రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా  చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీరేశం  గత కొంత కాలంగా  ప్రయత్నిస్తున్నారు. అయితే  కాంగ్రెస్ పార్టీలో వీరేశం చేరికను భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. వెంకట్ రెడ్డి  సానుకూలంగా  ఉంటే  వీరేశం  చేరికకు ఇబ్బందులు ఉండేవి కావనే ప్రచారం  కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుంది. అయితే  వీరేశం  ఏ పార్టీ నుండి  పోటీ చేస్తారనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది.


భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు

హైద్రాబాద్ ఉప్పల్  సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి  బీఆర్ఎస్  జాబితాలో  చోటు  దక్కలేదు.ఉప్పల్  అసెంబ్లీ స్థానం నుండి  బండారు లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.  అయితే  ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుండి  జీహెచ్ఎంసీ మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ రావు  పోటీ చేయాలని భావించారు.  కానీ  బొంతు రామ్మోహన్ రావును కూడ కాదని బండారు లక్ష్మారెడ్డికి  బీఆర్ఎస్ నాయకత్వం  టిక్కెట్టు కేటాయించింది.  చివరి దశలో  భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ రావులు  కలిసిపోయారు. తమ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా  ఇబ్బంది లేదని  ఎమ్మెల్సీ కవితకు చెప్పారు. కానీ లక్ష్మారెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని  కోరారు. కానీ  పార్టీ నాయకత్వం  లక్ష్మారెడ్డికే టిక్కెట్టు ఇచ్చింది.  టిక్కెట్టు దక్కకపోవడంతో  భేతి సుభాష్ రెడ్డి ఇంటికి ఆయన అనుచరులు  వస్తున్నారు. భేతి సుభాష్ రెడ్డి  ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు

ఇదిలా ఉంటే అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ కు  బీఆర్ఎస్ నాయకత్వం  టిక్కెట్టు కేటాయించింది. అయితే  కాలేరు వెంకటేష్ కు  టిక్కెట్టు ఇవ్వవద్దని  స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. అయినా కూడ పార్టీ నాయకత్వం వాటిని పట్టించుకోలేదు. కాలేరు వెంకటేష్ కు  టిక్కెట్టు కేటాయించింది. దీంతో బీఆర్ఎస్ అంబర్ పేట నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  కాలేరు వెంకటేష్ కు సహకరించబోమని తేల్చి చెప్పారు.

భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తుల సమావేశాలు: పక్క పార్టీల వైపు చూపు


పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి బీఆర్ఎస్ మరోసారి టిక్కెట్టు  కేటాయించింది.  దీంతో  ఈ స్థానం నుండి  టిక్కెట్టు  ఆశించిన నల్ల మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే  రేఖా నాయక్ కు  టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆమె భర్త  కాంగ్రెస్ లో చేరారు. రేఖా నాయక్ కూడ  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
 

Latest Videos

click me!