కేసీఆర్ 67వ బర్త్ డే : చంద్రబాబు, రోజా విషెస్.. నా అభిమాన నాయకుడంటూ.. పవన్ కల్యాన్ సెన్సేషన్..

Published : Feb 17, 2021, 02:08 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి తన అభిమాన రాజకీయ నాయకుడని, వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్ ని ఇష్టపడతారని చెబుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
19
కేసీఆర్ 67వ బర్త్ డే : చంద్రబాబు, రోజా విషెస్..  నా అభిమాన నాయకుడంటూ.. పవన్ కల్యాన్ సెన్సేషన్..

తెలంగాణ ముఖ్యమంత్రి తన అభిమాన రాజకీయ నాయకుడని, వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్ ని ఇష్టపడతారని చెబుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి తన అభిమాన రాజకీయ నాయకుడని, వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్ ని ఇష్టపడతారని చెబుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

29

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు, ప్రతిపక్షనేతలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

39

కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ నేత బి.ఎస్. యడ్యూరప్ప ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఝకాలం, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశ వ్యక్తం చేశారు. 

49

టీడీపీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గతంలో కేసీఆర్ సహచరుడు చంద్రబాబు నాయుడు కూడా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. 

59

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్.. ‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కే.చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను’ అంటూ చక్కటి తెలుగుతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

69

ఇక వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ రోజా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు, పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

79

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన, జనసైనికుల పక్షాన గౌరవ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను అభిమానించే సమకాలీన రాజకీయ వేత్తలలో శ్రీ కేసీఆర్ గారు ఒకరు. దార్శనికత, ధృడ సంకల్పం ఆయనలో పుష్కలంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన రాజకీయ శైలిని నిశితంగా అర్థం చేసుకుంటున్నాను. 

89

ప్రజలకు చేరువ కావడానికి ఆయన అమలుపరిచే విధానాలు, వాటి సరళి ఎంతో ప్రభావితంగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత ఆయన ప్రపజలందరినీ సమైక్యంగా ఉంచడానికి చేసిన కృషి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల వారందరినీ అక్కున చేర్చుకోవడం ఆయన పరిపాలనా దక్షతకు ప్రతీక. 

99

వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్ గారిని ఇష్టపడడం ఆయనలోని రాజకీయ ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనం. శ్రీ చంద్రశేఖర్ రావు గారు చిరంతనంగా ప్రజలకు సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఆయనకు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. 

click me!

Recommended Stories