సిద్దిపేట, సిరిసిల్ల అన్నదాతలకు సీఎం పుట్టినరోజు కానుక... అందించిన హరీష్ రావు

First Published Feb 17, 2021, 2:06 PM IST

ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని  సాధించి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి  గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మదన్యం అయిందన్నారు మంత్రి హరీష్ రావు. 

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున తన నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు తీపికబురు అందించారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు హరీష్ రావు.
undefined
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ... సీఎం జన్మదినం సందర్బంగా మొట్టమొదటిసారి యాసంగి పంటకు ఈ ప్రాంత ప్రజలకు నిళ్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని సాధించి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మదన్యం అయిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కళ.. ఆ కలను సీఎం కెసిఆర్ నిజం చేశారని కొనియాడారు. ఈ యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగు నీరు అందిస్తామన్నారు.
undefined
గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి వేతలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారన్నారు. ఎండాకాలం వచ్చిందంటే రైతుల శ్రమ, డబ్బు బోరు పొక్కల్లో పోయేదని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలో యాసంగి పంట ఏనాడు 20 లక్షల ఎకరాలకు మించేది కాదని.. కానీ ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కాలేశ్వరం ద్వారా నీళ్లు తేవడం వల్లనే ఇది సాధ్యం అయిందని మంత్రి పేర్కొన్నారు.
undefined
ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితి నుంచి కేసీఆర్ ముందు చూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే స్థితికి చేరుకున్నామన్నారు. ఇది సిద్దిపేట ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తొలి సారీ యాసంగి పంటకు నీళ్లు విడుదల చేయడంతో జన్మచరితార్థం అయిందన్నారు. సిద్దిపేట , సిరిసిల్ల , హుస్నాబాద్ మూడు నాలుగు నియోజకవర్గాలకు ఈ సాగునీరు అందనుందని మంత్రి హరీష్ పేర్కొన్నారు.
undefined
click me!