ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా రోజుల తరువాత వార్తల్లో నిలిచాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన పాల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట.
కరోనా గురించి తాను ముందే హెచ్చరికలను ఇచ్చినప్పటికీ....తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, చివరికి కేసీఆర్‌కే కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన వాపోయారు.
కేసీఆర్ సిబ్బందిలోనే 24 మందికి కరోనా సోకిందన్నారుపాల్.తాను ఇంతకుమునుపుచెప్పినట్లు భారత్‌లో కనీసం 10 శాతం మందికి కరోనా సోకుతుందని మరోసారి అన్నారు.
ఇక తన ఎవర్ గ్రీన్ డైలాగ్స్ తో మరోసారి ఉపన్యసించారు. తానుప్రపంచంలో హయ్యస్ట్ పెయిడ్ స్పీకర్ అన్న విషయాన్నీమర్చిపోకండని, ప్రపంచంలోనే బోయింగ్ 747 విమానంలో తిరిగిన ఏకైక వ్యక్తిని తానే అన్న విషయాన్నీ కూడా గుర్తెరగండని అన్నాడు.
ప్రపంచంలో 100 కోట్ల మందిని తనసువార్త ద్వారా దేవుడు రక్షించాడని, 7 పెద్ద యుద్ధాలను తాను ఆపానన్న విషయాన్నీ కూడాగుర్తుంచుకోండని అన్నాడు. తనను జోకర్లుగా చూస్తూ....మీరు జోకర్లు కాకండని హితబోధ చేసారు.
ఇదంతాదేవుడి దయ అని,అందరి ప్రార్థన అని,2.1 కోట్ల మంది ప్రతి శనివారం తనతో ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితం అని, తానురాసిన పుస్తకం త్వరలో రాబోతోందని అన్నాడు పాల్.
కరోనాను తరిమేయడంలోప్రజలంతా తనకు మద్దతుగాతన వెనుక నిలబడాలని, తనతో కలిసిరావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. పనిలో పనిగా చైనా మేటర్ మీద కూడా మాట్లాడారు పాల్.
కరోనాకు కారణమైన చైనాను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఎండగట్టాలని, దానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ లో కావాలనేఉద్దేశపూర్వకంగానే బయటకు వదిలారని, గతంలో కూడా తాను ఇదే విషయాన్నీ చెప్పానని పాల్ అన్నారు.
ఇకపోతే.... ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ సత్యం,సబ్ ఎడిటర్ శివతో పాటు, రిపోర్టర్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. సీఎంకు కరోణ అనే వార్త ప్రచురించినందుకు, గానూ నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసారు పోలీసులు.