న్యాయమా సారు?: అటెండర్ తో బూట్లు తుడిపించుకున్న కలెక్టర్

First Published Jul 6, 2020, 3:45 PM IST

ఐఏఎస్ అయినా.. అటెండర్ అయినా.. తోటి ప్రభుత్వ ఉద్యోగే. సాటి మనిషే.. ఈ విషయాన్ని మరిచాడనుకుంట.. ఈ శిక్షణా ఐఏఎస్ అధికారి.

దేశంలోనే అత్యుత్తమ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసాడు. కలెక్టర్ గా ఎంపికయ్యాడు. ట్రైనింగ్ లో ఉన్నాడు. ఇలాంటి ఒక ఉన్నతోద్యోగి అటెండర్ తో తన బూతును తూడిపించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.
undefined
వివరాల్లోకి వెళితే.... అతని పేరు అంకిత్. ట్రైనీకలెక్టర్.బూట్లకు మట్టి అంటుకోవడంతోఅంటిన మట్టిని తియ్యమని అటెండర్ కు పురమాయించాడు ఈ పెద్ద సారూ.
undefined
ఐఏఎస్ అయినా.. అటెండర్ అయినా.. తోటి ప్రభుత్వ ఉద్యోగే. సాటి మనిషే.. ఈ విషయాన్నిమరిచాడనుకుంట.. ఈ శిక్షణా ఐఏఎస్ అధికారి. ఇంకా పూర్తి స్థాయిలో విధుల్లో చేరకముందే ఇలా ఉంటె... విధుల్లో చేరితే.... అని అందరూ అనుకుంటున్నారు.
undefined
విషయానికొస్తే.. శిక్షణా కలెక్టర్ అంకిత్ విధుల్లో భాగంగా శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి వెళ్లాడు. భూముల సర్వేను పరిశీలించాడు. పొలం గట్ల పైనుంచి నడిచే సమయంలో బూటుకాలికి మట్టి అంటుకుంది.
undefined
దాన్నితనవెంటవచ్చిన అటెండర్తో ఇలా తుడిపించుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ సదరు అధికారిపై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు.
undefined
undefined
undefined
click me!