పురిట్లోనే కవల ఆడబిడ్డలకు విషమిచ్చిన కసాయి తండ్రి... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి

First Published Sep 22, 2020, 10:10 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంత ఖర్చయినా నవజాత శిశువుల్ని కాపాడమని రవి చిన్నపిల్లల ఆసుపత్రి ఎండి డాక్టర్ శేఖర్ ను కోరడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. 

మహబూబ్ నగర్: మానవ సంబంధాలను మచ్చతెచ్చే ఉదంతం ఒకటి ఒకటి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పురిట్లోని కవల ఆడబిడ్డలకు విషమిచ్చి చంపాలని ఓ కసాయి తండ్రి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ఆడబిడ్డలకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో ఆ బిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఆ ఆడపిల్లలను, ఆమె తల్లిని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దీంతో ఈ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.
undefined
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంత ఖర్చయినా నవజాత శిశువుల్ని కాపాడమని రవి చిన్నపిల్లల ఆసుపత్రి ఎండి డాక్టర్ శేఖర్ ను కోరడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. దీంతో రవి చిల్డ్రన్ ఆస్పత్రి వైద్య బృందం 22 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి ఆ పసికూనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు.
undefined
ఈ సందర్భంగా మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రిని సందర్శించి నవజాత శిశువుల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మలిచిన ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నవజాత శిశువుల్ని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆ బిడ్డల తల్లికి ధైర్యం చెప్పారు.
undefined
కవల ఆడపిల్లల్ని దుర్మార్గంగా చంపాలని ప్రయత్నించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తాము కోరిన విధంగానే ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పిల్లలను రక్షించిన ఆస్పత్రి యండి శేఖర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
undefined
ఆ శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.భవిష్యత్తులో ఆ శిశువులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.
undefined
click me!