టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ: మధ్యలో కోదండరామ్, ఎవరికి దక్కునో?

First Published Sep 21, 2020, 3:39 PM IST

త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్  నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఈ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. ఒక్క స్థానంలో టీఆర్ఎస్ తన అభ్యర్ధిని నిర్ణయించింది.మరో స్థానంలో పోటీ  చేసే అభ్యర్ధి కోసం బొంతు రామ్మోహన్ పేరును పరిశీలిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఆశావాహులు పోటీపడుతున్నారు. ఈ రెండు పదవుల కోసం పోటీ పడుతున్న నేతల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కత్తిమీద సాముగా మారింది.
undefined
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తమ సత్తా చూపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరో వైపు ఒక్క స్థానం నుండి పోటీ చేయాలని తెలంగాణ జనసమితి భావిస్తోంది. ఈ విషయమై తనకు మద్దతివ్వాలని టీజేఎస్ కూడ కాంగ్రెస్ పార్టీని కోరినట్టుగా సమాచారం.
undefined
మరో వైపు ఇదే విషయమై సీపీఐ నేతలకు కూడ టీజేఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
undefined
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, రాములునాయక్, మానవతారాయ్. కత్తివెంకటస్వామి, దామోదర్ రెడ్డి తదితరులు ఆసక్తిగా ఉన్నారు.
undefined
హైద్రాబాద్, మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కూడ పెద్ద ఎత్తున నేతలు టిక్కెట్టు ఆశిస్తున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రామ్మోహన్ రెడ్డి, కేఎల్ఆర్ తదితరులు పోటీ పడుతున్నారు.
undefined
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీకి సిద్దమౌతున్నట్టుగా సమాచారం. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును టీజేఎస్ కోరుతోంది. అయితే ఈ స్థానాన్ని టీజేఎస్ కు కేటాయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొందరు ఆసక్తిగా లేరని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
మరో వైపు ఈ రెండు స్థానాల్లో పోటీ కోసం ప్రయత్నిస్తున్న నేతలు టిక్కెట్టు కోసం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించేందుకు ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు.
undefined
రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వడపోసి నలుగురైదుగురితో షార్ట్ లిస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించినట్టుగా సమాచారం. నేతల జాబితా వడపోత కార్యక్రమం ఉత్తమ్ కు సవాలేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
click me!