రంగంలోకి హరీష్ రావు: దుబ్బాకలో వార్ వన్ సైడేనా?

First Published | Sep 22, 2020, 3:30 PM IST

దుబ్బాకలో త్వరలో జరిగే ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి నుండే రంగం సిద్దం చేసింది. మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ఈ నియోజకవర్గంంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే వరకు నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంగా మంత్రి హరీష్ పర్యటనలు సాగిస్తున్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే ఈ దఫా టిక్కెట్టు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని సమాచారం. రామలింగారెడ్డి భార్య సుజాతకు టిక్కెట్టు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం.
సోలిపేట రామలింగారెడ్డి మరణించిన తర్వాత ఆ కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వొద్దని కోరుతూ అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహించారు. ఈ పరిణామం టీఆర్ఎస్ నేతల్లో కలవరానికి కారణమైంది. అసమ్మతి నేతలను టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించింది.
పార్టీలోని అసమ్మతి నేతలతో హరీష్ రావు చర్చించారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు మంత్రి హరీష్ రావు.
అసమ్మతి శ్రేణులను కూడ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసేలా హరీష్ రావు చక్రం తిప్పుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ లోని అసమ్మతిని సొమ్ము చేసుకొనేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాయి.
సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గం కూడ తనకు జోడెద్దుల లాంటివని మంత్రి హరీష్ రావు ఇటీవల ప్రకటించారు. రానున్న రోజుల్లో తాను దుబ్బాక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాననే హామీ ఇచ్చారు.
దుబ్బాకలో రెండో స్థానం కోసం విపక్షాలు పోటీ పడుతున్నాయన్నారు. టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని కార్యకర్తల్లో మంత్రి హరీష్ రావు జోష్ నింపుతున్నారు.దుబ్బాకలో మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగడంతో వార్ వన్ సైడేనా అనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు కూడ టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

Latest Videos

click me!