కత్తి చేతబట్టి, విల్లు ఎక్కుపెట్టి... మంత్రి మల్లారెడ్డి విన్యాసాలు చూడండి...

First Published | Apr 12, 2023, 3:14 PM IST

తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి హకీంపేట్ లోని క్రీడా పాఠశాలను మంత్రి మల్లారెెడ్డి సందర్శించారు. 

Malla Reddy

హైదరాబాద్ : చామకూర మల్లారెడ్డి... తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటలతో, చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే మల్లారెడ్డి ఇటీవల సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతున్నారు. అందరు రాజకీయ నాయకుల్లా ఎప్పుడూ సీరియస్ గా వుండకుండా తనదైన చలోక్తులతో తోటి నాయకులతోనే కాదు ప్రజలతోనూ సరదాగా వుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మల్లారెడ్డి.  

Malla Reddy

కష్టపడ్డా... పూలమ్మినా... పాలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియా సెన్సెషన్ గా మారింది. ఇలా డిఫరెంట్ రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్న మల్లారెడ్డి తాజాగా కత్తిపట్టి, విల్లు ఎక్కుపెట్టి క్రీడాకారుడిగా మారిపోయారు.  

Latest Videos


Malla Reddy

హైదరాబాద్ శివారు హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి సందర్శించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా రూ.13కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్, వెయిట్ లిప్టింగ్, ఫిజియో థెరపీ, స్ట్రెంత్ ఆండ్ కండిషన్ హాల్స్ తో పాటు 4.5 కిలోమీటర్ల క్రాస్ ట్రాక్ ను ప్రారంభించారు.

Malla Reddy

ఈ క్రమంలోనే మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి కత్తులు చేతబట్టి ఫెన్సింగ్ ఆడారు. మంత్రులిద్దరు కొద్దిసేపు కత్తిసాము చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు కూడా సరదాగా మంత్రులు కత్తిసాము చేయడంతో కేరింతలు కొడుతూ వీక్షించారు.
 

Malla Reddy

కేవలం కత్తిసాముతో ఆగిపోకుండా మంత్రులు మరికొన్ని ఆటలాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులతో కలిసి మంత్రులిద్దరు విల్లు ఎక్కుపెట్టారు. ఇలా ఆర్చరీ కూడా ప్రాక్టీస్ చేసారు మంత్రులు. 
 

Malla Reddy

కాస్సేపు జిమ్ లో కసరత్తులు కూడా చేసారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి. భారీ రోప్ తో పాటు వివిధ జిమ్ పరికరాలతో మంత్రులు విన్యాసాలు చేసారు. 

Srinivas Goud

కేవలం ఇండోర్ గేమ్స్ మాత్రమే కాదు ఔట్ డోర్ గేమ్స్ కూడా ఆడారు మంత్రులు. కాస్సేపు వాలాబాల్ ఆడుతూ సందడి చేసారు. 
 

Srinivas Goud

ఇక విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన సదుపాయాలను కూడా మంత్రులు పరిశీలించారు. ఎండాకాలంలో ఆటలాడి అలసిపోయే విద్యార్థులు కోసం చల్లటి మంచినీటితో కుండలు ఏర్పాటుచేసారు. ఈ నీటిని కూడా తాగారు మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్. 
 

Hakimpet

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడా పాఠశాల ఓఎస్డి డాక్టర్ హరికృష్ణ, సాట్స్ ఉన్నత అధికారులు సుజాత, మనోహర్ పాల్గొన్నారు.
 

click me!