తెలంగాణ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. మహబూబ్ నగర్ లోని జడ్పీ మైదానం నుండి వేలాదిమంది రైతులతో ర్యాలీగా బయలుదేరిన మంత్రి స్వయంగా చావు డప్పు మ్రోగించారు.