ఈ సందర్భంగా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబిత. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతలకు రక్షాబంధన్ నిదర్శనమని అన్నారు. ఆడపడుచులకు అన్నదమ్ములు ఎప్పుడు రక్షణగా వుంటారని గుర్తుచేసే పండగ ఇదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.