అక్కతో కలిసి ఇంట్లోనే మద్యం సేవించిన చందన భాయ్ ప్రెండ్ పరారయ్యింది. ఏమయ్యిందో తెలీదుగానీ అక్క దీప్తీ మృతిచెందడం, చెల్లి నగదు, బంగారంతో పరారవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బయటకురానున్న దీప్తి పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. దీప్తి మృతిపై నెలకొన్న అనుమానాలపై ఈ పోస్టుమార్టం రిపోర్ట్ తో కొంత క్లారిటీ రానుంది. దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అన్నది తేలనుంది.