సూర్యాపేట: టీఆర్ఎస్ పార్టీ పిలుపుతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు కూడా టీఆర్ఎస్ నిరసనల్లో పాల్గొన్నారు. ఇలా మంత్రి జగదీష్ రెడ్డి ఇలాకా సూర్యాపేటలో కూడా మహిళలు గ్యాస్ సిలిండర్ తో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి శంకర్ విలాస్, యంజి రోడ్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మహిళలు దగ్దం చేశారు.