హైదరాబాద్: ఇవాళ(బుధవారం) తెల్లవారుజామునే పొట్టకూటికోసం తెలంగాణకు వలసవచ్చిన బిహారీ కార్మికుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి ఏకంగా 11 మంది సజీవదహనం అయ్యారు. మరో నలుగురు కార్మికులు ఈ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాయంటే అగ్నిప్రమాదం తీవ్రత ఎలా వుందో తెలుస్తోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంలో గోడౌన్ లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి.