ఏడుపాయల దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్

First Published Mar 11, 2021, 11:59 AM IST

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి హరీష్ రావు. 

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంజీరా నదీ ఒడ్డున వెలిసిన ఏడుపాయల వనదుర్గమ్మను ఆర్థిక మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు హరీష్ రావు.
undefined
అమ్మవారి దర్శనం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో ఏడుపాయలలో ఉత్సవాలు దినదినాభివృద్ది చెందుతున్నాయన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశామన్నారు. అలాగేపోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
undefined
అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని... ఈ నీటితో కోటి ఎకరాల పంట సాగు అవుతోందన్నారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు హరీష్.
undefined
ఇప్పటికే ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశారని... రూర్బన్ పథకం నుంచి ఇక్కడ ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు.
undefined
click me!