Huzurabad bypoll : ఈటల రాజేందర్ సంపన్నుడు.. ఆయన ఎలాగైనా బతకగలడు.. హరీష్ రావు

First Published Oct 9, 2021, 3:14 PM IST

ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు. హుజురాబాద్ ను జిల్లాలు చేయాలని చేశారా ..లేక అభివృద్ధి కోసం చేశారా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

minister harish rao election campaigning

ఇల్లంతకుంట మండలం వంతడుపులలో  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఇది నడమంతరపు ఎన్నిక అన్నారు. 

ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు. హుజురాబాద్ ను జిల్లాలు చేయాలని చేశారా ..లేక అభివృద్ధి కోసం చేశారా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎవరైనా రాజీనామాలు చేస్తే అనారోగ్యంతో ఉంటే నో లేకుంటే అభివృద్ధి కోసమో చేస్తారు. ఈటెల ఓ మెడికల్ కాలేజీ కావాలనో, హుజురాబాద్ జిల్లా కావాలనో... రాజీనామా చేయలేదు.. కేవలం తన ఆస్తులు కాపాడుకునేందుకు మాత్రమే రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు.

minister harish rao election campaigning

ఈటల రాజేందర్ సంపన్నుడు.. ఆయన ఎలాగైనా బతకగలడు... కానీ గెల్లు శ్రీనివాస్ నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు.. తెలంగాణ కోసం ఉద్యమించాడు, జైలుకు వెళ్లాడు... కేసుల పాలయ్యాడు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరు. గతంలో కాలువలో నీళ్ల కోసం రైతులు ఎదురు చూసే వాళ్ళు.. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్ళు కనబడుతున్నాయి.

నెత్తి మీద గంగమ్మ ఉన్నట్లుగా ఉంది. కాలానికి సంబంధం లేకుండా నీళ్లు ప్రతి చోటికి అందుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మీట నొక్కితే నీళ్లు పొలాలకు చేరుతున్నాయి. గతంలో ట్రాన్స్ఫార్మర్లు తేలిపోయేవి, మోటార్లు కాలిపోయేవి.  కానీ నేడు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో అలాంటి పరిస్థితులు లేవు ఉచిత విద్యుత్తు నిరంతర విద్యుత్తు రైతులకు అందుతోందన్నారు.

minister harish rao election campaigning

చేద బావి లో నీళ్లు చెంబుతో ముంచుకునే రోజులు.. సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమైందని, మళ్లీ పాత రోజులు వచ్చాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం రైతుల బావుల దగ్గర మీటర్లు పెట్టే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి వైయస్ జగన్ బావులకు మీటర్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. కానీ సీఎం కేసీఆర్ ‘నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనివ్వం’ అని తేల్చి చెప్పారన్నారు.

పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన బిజెపికి ఎలా ఓటేస్తారు. గతంలో పొలాన్ని దున్నేందుకు ఇరవై ఐదు వందలు ఖర్చయ్యేది కానీ నేడు ఆ ఖర్చు ఐదు వేలకు చేరుకుంది ఇది బిజెపి వైఫల్యమే అని మండిపడ్డారు. గ్యాస్పై సబ్సిడీ ని తగ్గించారు 400 ఉన్న గ్యాస్ ధర వెయ్యి కి చేరుకుంది పండగ పూట కూడా వినియోగదారులను వదలడం లేదు. పండగ పూట కూడా ప్రతిరోజు ధరలు పెంచుతున్నారు.

Harish rao

కెసిఆర్ ఎకరానికి 5000 రైతుబంధు ద్వారా ఇస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి వాటిని గుంజుకునే  ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి ఈటల మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఆరుసార్లు ఎమ్మెల్యేలు చేసి రెండుసార్లు మంత్రిని చేస్తే కె సి ఆర్ కు గోరి కడతా అని అంటున్నాడు. దీన్ని ప్రజలు గమనించాలి.

బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తోంది. నిరుద్యోగం పెంచుతోంది. ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు కట్ట పెడుతోంది. బొట్టు బిల్లా కావాలా లేక కల్యాణలక్ష్మి కావాలా? కుక్కర్ లు కావాలా? గ్రైండర్లు కావాలా? లేక పింఛన్లు దళిత బంధు రైతు బంధు కావాలా?

Harish rao

దున్నపోతుకు గడ్డి వేసి బర్రెల కు పాలు పిండితే వస్తాయా? గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఐదు వేల ఇళ్లు నిర్మించి ఇస్తాం.

గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి నియోజకవర్గ అభివృద్ధికి నేను జిమ్మె దార్ తీసుకుంటా.. చేయిస్తా...మహిళలు ఓటు వేసే ముందు వంటింట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి పోలింగ్ కేంద్రానికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.

Harish rao

బిజెపి వాళ్లు బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ఈటల రాజేందర్ సభలో కరెంటు పోతే నేనే తీయించాలని ప్రచారం చేశారు నేను అధికారులకు ఫోన్ చేశాను ఆ ఫంక్షన్ హాల్ కు కరెంటు లేదని రెండు నెలల కింద బిల్లు కట్టలేదని తొలగించామనీ అని చెప్పారు. జనరేటర్ లో డిజిల్ అయిపోయి కరెంటు పోతే ఆ నెపాన్ని కూడా నా మీదకు నెడుతున్నారు

వాళ్ల వాహనాల మీద వాళ్లే దాడి చేయించుకుని నా మీదకు తోసే అవకాశం కూడా ఉందన్నారు. నిరుపేదల ఆడబిడ్డల వివాహానికి  ఇచ్చే కల్యాణలక్ష్మి కడుపు నింపదని, ఆసరా పింఛన్లు పరిగే ఏరు కున్నట్లు అని ఈటెల అవమానించారు. బిజెపి నాయకులు జూటా మాటలు మాట్లాడుతున్నారు

Harish rao

బిజెపి నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్కపైసా అయినా కేంద్రం నుండి తీసుకువచ్చాడా? నల్ల చట్టాలు తెచ్చి దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై దాడులు చేసింది బిజెపి ప్రభుత్వం.. నిన్న కాక మొన్న రైతులు ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేస్తే.. వాళ్ల పైకి కారు ఎక్కించి చంపారని అన్నారు. రైతులను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటూ కాపాడుకుంటున్నారని, ఈటెల రాజేందర్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఓట్లకు రావాలని డిమాండ్ చేశారు. 

click me!