గతంలో సైతం ఇదే రీతిన కొనుగోళ్ళు జరిగాయని వాటికి సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్యదర్శికి అందించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో సమగ్రంగా చర్చించిన మంత్రి గంగుల, తెలంగాణలో మిల్లింగ్ కొనసాగుతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు కేంద్ర కార్యదర్శి మధ్యాహ్నం ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు, తద్వారా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తోపాటు కేంద్ర కార్యదర్శి సుదాన్షు పాండే, తెలంగాణ సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.