ప్రగతి భవన్ ‌కు ప్రకాష్ అంబేద్కర్: కేసీఆర్‌తో లంచ్ మీటింగ్

First Published | Apr 14, 2023, 4:12 PM IST

తెలంగాణ  సీఎం  కేసీఆర్ తో  అంబేద్కర్ మనమడు  ప్రకాష్ అంబేద్కర్  ఇవాళ భేటీ అయ్యారు.  ప్రగతి భవన్ లో  కేసీఆర్ తో ఆయన  సమావేశమయ్యారు

kcr -prakash ambedkar

 తెలంగాణ సీఎం  కేసీఆర్ తో  అంబేద్కర్  మనమడు  ప్రకాష్ అంబేద్కర్  శుక్రవారంనాడు భేటీ అయ్యారు.  ప్రగతి భవన్ లో  కేసీఆర్  తో  కలిసి  ప్రకాష్ అంబేద్కర్   మధ్యాహ్నభోజనం  చేశారు.

kcr-prakash amebekar

దేశంలోనే  అతి ఎత్తైన  అంబేద్కర్ విగ్రహవిష్కరణ  కార్యక్రమంలో పాల్గొనేందుకు  ప్రకాష్ అంబేద్కర్ నిన్న రాత్రే  హైద్రాబాద్ కు వచ్చారు. ఇవాళ  ఉదయం  కరీంనగర్  జిల్లాలోని  హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో   దళితబంధు  పథకం  అమలు తీరును  ప్రకాష్  అంబేద్కర్  పరిశీలించారు.


kcr-prakash amebekar

 హుజూరాబాద్ నుండి  ప్రకాష్ అంబేద్కర్   హైద్రాబాద్  కు చేరుకున్నారు. ప్రగతి భవవన్ లో  కేసీఆర్ తో  భేటీ అయ్యారు.  కేసీఆర్ తో కలిసి  ప్రకాష్ అంబేద్కర్  మధ్యాహ్న భోజనం  చేశారు.  ప్రగతి భవన్ నుండి  అంబేద్కర్ విగ్రహ విష్కరణ కార్యక్రమానికి  చేరుకున్నారు. 

kcr-prakash ambedkar

తెలంగాణ  రాష్ట్రంలో  అమలు  చేస్తున్న  దళితబంధు  పథకాన్ని  ప్రకాష్ అంబేద్కర్  అభినందించారు.  అన్ని  రాష్ట్రాల్లో ఇదే తరహ పధకాన్ని అమలు  చేయాలని   ప్రకాష్ అంబేద్కర్ కోరారు. 

kcr-prakash ambedkar


అంబేద్కర్  విగ్రహ విష్కరణకు  వచ్చిన  ప్రకాష్ అంబేద్కర్ రాష్ట్రంలో అమలౌతున్న పథకాల గురించి కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. 

Latest Videos

click me!