హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. రేపటి నుంచే అమలు.. ట్రైన్ షెడ్యూల్ ఇదే

First Published Sep 5, 2021, 8:16 PM IST

హైదరాబాద్ నగర మెట్రో ట్రైన్ సేవల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. తొలి మెట్రో ట్రైన్ ఉదయం 7 గంటలకు స్టేషన్ నుంచి బయల్దేరగా, చివరి ట్రైన్ రాత్రి 10.15 గంటలకు స్టేషన్ నుంచి బయల్దేరి రాత్రి 11.15 గంటలకు చివరి స్టేషన్‌ చేరుకుటుంది. ఈ మార్పులు రేపటి నుంచే అంటే సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి.

నగర ప్రజలకు మరో ముఖ్యవార్త. హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ మరోసారి షెడ్యూల్‌ను మార్చింది. ఆదివారం చేసిన రీషెడ్యూల్ సోమవారం నుంచి అమలవుతుందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ వెల్లడించింది. సోమవారం నుంచి నగరంలో మెట్రో రైల్ సేవలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి ట్రైన్ ఉదయం 7 గంటలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 

చివరి ట్రైన్ రాత్రి 10.15 గంటలకు స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ట్రైన్ తన చివరి ట్రిప్‌ను ముగించుకుని రాత్రి 11.15 గంటలకు చివరి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

మెట్రో ప్యాసింజర్లు అందరూ తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం, థర్మల్ స్క్రీనింగ్ సహా ఇతర జాగ్రత్తలు పాటించాని సూచించారు.

ప్రయాణికులందరూ సెక్యూరిటీ సిబ్బంది, మెట్రో రైల్ సిబ్బందితో సహకరించి సేఫ్‌ జర్నీకి తోడ్పడాలని కోరారు.

click me!