Published : Jul 07, 2026, 04:27 PM ISTUpdated : Jul 07, 2026, 04:58 PM IST
మనవడు కల్వకుంట్ల హిమాన్షు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి హుటాహుటిన బయలుదేరారు. ముద్దుల మనవడు గాయపడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన తాత వెంటనే హైదరాబాద్ కు చేరుకున్నారు.
Kalvakuntla Himanshu : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డాయి. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హిమాన్షు ఇటీవలే ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందేే... కుటుంబసభ్యులు, స్నేహితులతో గడుపుతూ కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న (జూలై 6, సోమవారం) సాయంత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు.
23
జిమ్ లో గాయపడ్డ హిమాన్షు
హిమాన్షు ముక్కుకు గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబసభ్యులు వెంటనే గచ్చిబౌలిలోకి ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే కేటీఆర్ దంపతులు హాస్పిటల్లోనే ఉన్నారు... కొడుకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదిస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాస్పిటల్ కు చేరుకుని హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా హాస్పిటల్ కు చేరుకుని మనవడిని పరామర్శించనున్నారు… ఇందుకోసం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది.
33
హిమాన్షు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ కీలక నాయకులంతా గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. అయితే ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని... హిమాన్షుకు గాయం చిన్నదేనని కేటీఆర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హిమాన్షుకు ట్రీట్మెంట్ జరుగుతోందని… త్వరలోనే అతడు కోలుకుంటాడని కేటీఆర్ అన్నారు. తన కొడుకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ చాలామంది ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని… వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నానని కేటీఆర్ అన్నారు.
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern