ప్రగతి భవన్ లో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు.. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని... మొక్కలు నాటాలని పిలుపు...

First Published Jul 12, 2021, 1:26 PM IST

తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారి తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మొక్కలు నాటారు.

కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారి తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మొక్కలు నాటారు.
undefined
తరువాత హిమాన్షు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన పిలుపునిచ్చారు.
undefined
ఈ సంవత్సరం హిమాన్షుకు ప్రత్యేకమైన జన్మదినం అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
undefined
తను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టిన విజయవంతంగా అమలు చేసినందుకు డయానా జాతీయ స్థాయిలో అవార్డు రావడం హిమాన్షు కు ఈ సంవత్సరం ఎంతో గొప్పది అన్నారు.
undefined
అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా నాతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటించడం చాలా సంతోషకరమైనందన్నారు. హిమాన్షు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నానని అతని బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలియజేశారు.
undefined
click me!