ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

First Published | Aug 31, 2023, 11:58 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. తుమ్మల నాగేశ్వరరావుకు  చెక్ పెట్టేందుకు 10 నియోజకవర్గాల్లో  ఇంచార్జీలను నియమించింది  బీఆర్ఎస్ నాయకత్వం. 

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు ఆ పార్టీ ఇప్పటినుండే  కార్యాచరణను  మొదలు పెట్టింది.  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు  కౌంటర్ వ్యూహంతో  బీఆర్ఎస్ నాయకత్వం  ముందుకు వెళ్తుంది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  10 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసేందుకు కార్యాచరణను  సిద్దం  చేసింది.

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

ఈ మేరకు  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు  ముఖ్యులను ఇంచార్జీలుగా  బీఆర్ఎస్ నాయకత్వం  నియమించింది.  నియోజకవర్గాల ఇంచార్జీగా  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇంచార్జీ  బాధ్యతలు ఇవ్వాలని తొలుత బీఆర్ఎస్ నాయకత్వం  భావించింది.  అయితే  ఇటీవల చోటు చేసుకున్న  పరిణామాలతో  వెనక్కు తగ్గింది. ఆశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావును ఇంచార్జీగా నియమించాలని తొలుత ఆ పార్టీ భావించింది. అయితే  ఆ తర్వాత మనసు మార్చుకుంది.


ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం


పాలేరు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ తుమ్మల నాగేశ్వరరావుతో చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది.   మరో వైపు జిల్లా వ్యాప్తంగా తన అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు  సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేసే అవకాశం ఉంది.  

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

పాలేరు నుండి పోటీకి తుమ్మల నాగేశ్వరరావు  ప్లాన్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న  తుమ్మల నాగేశ్వరరావు  వర్గీయులు  ఆయన వెంటే నడుస్తున్నామని  ప్రకటిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అలెర్ట్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి పువ్వాడ అజయ్ కుమార్,
సత్తుపల్లికి బండి పార్థసారథి రెడ్డి, భద్రాచలానికి తాతా మధుసూదన్, 
వైరా,  ఆశ్వరావుపేట నియోజకవర్గాలకు నామా నాగేశ్వరరావు,కొత్తగూడెం, ఇల్లెందులకు  వద్దిరాజు రవిచంద్ర,ఖమ్మంకు పువ్వాడ అజయ్ కుమార్, పాలేరుకు కందాల ఉపేందర్ రెడ్డి,పినపాకకు రేగా కాంతారావులను ఇంచార్జీలుగా నియమించింది.ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఏ నియోజకవర్గానికి కూడ ఇంచార్జీ పదవి కేటాయించలేదు.బాలసాని లక్ష్మీనారాయణ తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ఆయనకు ఏ నియోజకవర్గానికి బాధ్యతలు ఇవ్వలేదనే ప్రచారం సాగుతుంది.

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

2014, 2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి  బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఖమ్మం నుండి మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే  ముందుగానే  కీలక నేతలకు  ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది. మరో వైపు తుమ్మల నాగేశ్వరరావు  ప్రభావం ఆయా నియోజకవర్గాల్లో పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది. 

ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

ఈ నెల  21న  కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు  చోటు దక్కలేదు. పాలేరు నుండి  తుమ్మల నాగేశ్వరరావు సీటు ఆశించారు. కానీ  ఆయనకు పాలేరు సీటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాలేరు నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి  బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.  ఈ పరిణామం  తుమ్మల నాగేశ్వరరావును ఖంగు తినిపించింది. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై  తుమ్మల నాగేశ్వరరావు  కార్యాచరణను సిద్దం  చేసుకుంటున్నారు.బీఆర్ఎస్ కు కౌంటర్ వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు  ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావుకు  కౌంటర్  వ్యూహంతో  బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది.

Latest Videos

click me!