
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమద్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రోశయ్య మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా సంతాపం తెలిపారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తు చేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం అస్వస్థతతో మరణించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భార్య శివలక్ష్మితో వివాహవార్షికోత్సవ సందర్బంతో.. సంతోషంగా రోశయ్య దంపతులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Konijeti rosaiah కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలుమురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు
ఆ తరువాత కాంగ్రెస్ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య, కె విజయభాస్కర రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మత్రివర్గాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కుటుంబ సభ్యులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో మృతి చెందారు.
గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర మంత్రిగా..
రోశయ్య..1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి సర్కార్‌లో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు చేపట్టారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో మళ్లీ కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలను నిర్వర్తించారు.
2004, 2009లో వైఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 16 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇందులో చివరి ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఇంకా.. 1995-97 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రోశయ్య పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆ సమయంలోనే కర్ణాటక ఇంచార్జ్ గవర్నర్‌గా రోశయ్య అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఆర్థికమంత్రిగా..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు రోశయ్య ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ రూపకల్పనలో రోశయ్య తనదైన ముద్ర వేసేవారు. అయితే వయోభారంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోశయ్య మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కొణిజేటి రోశయ్య. ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించిందని, సంతాపం తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను సన్మానించిన సందర్భంలో...