పల్లె ప్రగతి : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పల్లె నిద్ర, మార్నింగ్ వాక్.. !

First Published Jul 3, 2021, 11:09 AM IST

ఆరోగ్య తెలంగాణ సాధన, హరిత తెలంగాణ కోసం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. 

ఆరోగ్య తెలంగాణ సాధన, హరిత తెలంగాణ కోసం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
undefined
ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి వాటిని పరిష్కరించడంతో పాటు ఈ ప్రాంతాన్ని పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఆయన పల్లెనిద్ర, మార్నింగ్ వాక్ కార్యక్రమాలను చేపట్టారు.
undefined
ఇందులో భాగంగా నియోజకవర్గంలోని బొమ్మరాసిపేట మండలం గిరిజన తండాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో భాగంగా రోటి బండ తండాలో పల్లెనిద్ర చేశారు.
undefined
అలాగే చోటుపల్లి, ముచ్చు కుంట తండాలో మార్నింగ్ వాక్ చేశారు. వీధులన్నీ తిరిగి గిరిపుత్రుల సమస్యలను తెలుసుకున్నారు. హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
undefined
టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు అందిస్తున్న పథకాలను గురించి వివరించారు. ముఖ్యంగా రైతులు మహిళల సమస్యలను ఆరాతీసి క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
undefined
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధనకై, కొడంగల్ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి అని అన్నారు.
undefined
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తామని నరేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ నాయకులు సైతం ఈ వినూత్న కార్యక్రమం లో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా ప్రజలతో మమేకం కావాలని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
undefined
click me!