వరంగల్: తెలంగాణ రాష్ట్రలో నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. భారీ కాన్వాయ్ తో వరంగల్ నగరానికి చేరుకున్న ఆమె కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. షర్మిలకు వరంగల్ జిల్లా నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.