ఇదిలా ఉంటే.. ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం ద్వారా క్రమశిక్షణ, భక్తి, సోదర భావం స్పూర్తితో ముస్లింలు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఈద్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సర్వశక్తిమంతుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా, సామరస్యపూర్వకంగా జీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.