తెలంగాణపై బీజేపీ ఫోకస్: కాంగ్రెస్ నేతలపై కమలం కన్ను

First Published Mar 2, 2021, 10:57 AM IST

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని  కైవసం చేసుకోనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ఆ పార్టీ వల వేస్తోంది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ నేతలపై బీజేపీ కేంద్రీకరించింది.
undefined
గత వారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీ పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరారు.
undefined
రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
undefined
మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇంకా పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డికె అరుణ ఆహ్వానించారు.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.
undefined
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ కూడ చేవేళ్ల ఎంపీ స్థానాన్ని కోరుకొంటున్నారని బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined
కాంగ్రెస్ లో నిర్లక్ష్యానికి గురైన నేతలతో పాటు టీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్న నేతలపై బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.
undefined
కాంగ్రెస్ పార్టీ నాంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ ఫిరోజ్ ఖాన్ కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫిరోజ్ ఖాన్ సమావేశమయ్యారని సమాచారం.
undefined
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది.
undefined
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శారద కూడ బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. కాంగ్రెస్ కు ఇటీవలనే మృత్యుంజయం గుడ్ బై చెప్పారు. ఆయన బీజేపీలో చేరారు. మృత్యుంజయం ఆమెను బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది.
undefined
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ కూడ బీజేపీలో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఎంపీగా ఓటమి పాలైన తర్వాత పార్టీ తన పట్ల నిర్లక్ష్యంగా ఉందని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
undefined
click me!