వైెెఎస్, ఎన్టీఆర్ ఇమేజ్ లకు కేసీఆర్ విరుగుడు: పీవీయే సరైనోడు

First Published | Jul 24, 2020, 4:49 PM IST

పీవీ బలమైన విశాలాంధ్రవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు ఆయన. అప్పట్లో తెలంగాణ ఉద్యమం, దానికి ప్రతిగా ఏర్పడ్డ జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ప్రత్యేక ఉద్యమాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది. 

జూన్ 28 నుండి పీవీ నరసింహ రావు శతజయంతి ప్రారంభమయ్యాయి. సాధారణంగా పీవీ నరసింహారావు మన తెలుగు బిడ్డ అయినప్పటికీ.... ఆయన జయంతి దినోత్సవం మనలో చాలా మందికి తెలియదు. ఈసారి శతజయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరపాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించడంతో ఈ విషయం పట్ల అందరూ ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని యోచన చేస్తున్నారు.
టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

కేసీఆర్ ఇలా పీవీ నరసింహారావు ను తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రకటించడం వెనుక కారణాల గురించి అందరూ తెగ యోచనలు చేస్తున్నారు. పీవీ నరసింహ రావు వాస్తవానికి కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అయ్యాడు. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. అయినా కేసీఆర్ ఇలా ఎందుకు పీవీ నరసింహారావు ను ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అందరి మెదళ్లలోనూ తిరుగుతున్న ప్రశ్న.
కేసీఆర్ ఇలా పీవీ నరసింహారావు ను తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రకటించడం వెనుక కారణాల గురించి అందరూ తెగ యోచనలు చేస్తున్నారు. పీవీ నరసింహ రావు వాస్తవానికి కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అయ్యాడు. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. అయినా కేసీఆర్ ఇలా ఎందుకు పీవీ నరసింహారావు ను ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అందరి మెదళ్లలోనూ తిరుగుతున్న ప్రశ్న.
కానీ పీవీబలమైన విశాలాంధ్రవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు ఆయన. అప్పట్లో తెలంగాణ ఉద్యమం,దానికి ప్రతిగా ఏర్పడ్డ జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ప్రత్యేక ఉద్యమాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది.
ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర ఎంతబలంగాణా ఉందొ తెలుసుకోవాలంటే 1984 పార్లమెంటు ఎన్నికలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇందిరా మరణం తరువాత దేశంఅంతా బలంగా కాంగ్రెస్ సానుకూల పవనాలు వీచినప్పటికీ... ఆయన మాత్రం హన్మకొండ నుంచి ఓడిపోయారు.
తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఆయనను తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తించడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు మాత్రం పీవీని తెలంగాణ ఐకాన్ గా నిలబెట్టాలని అనుకుంటున్నారు.పీవీ నరసింహ రావును తెలంగాణ ఐకాన్ గా జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటివరకు తెలంగాణకు జాతీయస్థాయి నాయకుడు ఎవ్వరు లేరు. ఆ కొరతను ఇప్పుడు పీవీ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నారు కేసీఆర్.
పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల ప్రోజెక్ట్ చేయడానికి ఇష్టపడదు. ఆయనకు సోనియా గాంధీ కి అస్సలు పడదు అన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ వారికున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని ఆయన ఆయన పీవీని తెలంగాణ సింబల్గా, తెలంగాణ సెంటిమెంటును ఇప్పటికే కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్న తెరాస ఐకాన్ గా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది.
కాంగ్రెస్ కాలగర్భంలో గతించిన నాయకులను వెలికితీసి తమ సింబల్స్ గా చూపెట్టుకునే బీజేపీ కన్నా ముందుగా పీవీని సొంతం చేసుకోవాలని కుంటున్నారు కేసీఆర్. పీవీని మరో పటేల్ లాగ బీజేపీ చేతికి అందించొద్దు అనుకోవడంతో పాటుగా పీవీని తన పార్టీ పటేల్ లాగా ఒక చెరగని ముద్ర వేయాలని చూస్తున్నాడు.
టీడీపీకి ఎన్టీఆర్, కాంగ్రెస్ కి రాజశేఖర్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సింబల్ గా ఉన్నారు. తెలంగాణ కు ఆ స్థాయి గుర్తింపు గౌరవం లేదు. ఇక మీదట తెలంగాణాలో ఐకాన్ గా కేవలం పీవీ నర్సింహారావు మాత్రమే నిలబడాలి, ఆయనపై పూర్తి ప్రొప్రయిటరి హక్కులు తెరాస కేదక్కాలనేది కేసీఆర్ యోచనగా కనబడుతుంది.
పీవీ నరసింహ రావు ను నిలబెట్టడం ద్వారా ఆయన బీజేపీ హిందుత్వ రాజకీయాలకు కూడా అడ్డుకట్టవేయాలని అనుకుంటున్నాడు. పీవీకి బలమైన హిందుత్వ వాది అనే ముద్ర కూడా ఉంది(బాబ్రీ మసీద్ కూల్చివేత విషయంలో). దాన్ని ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి తెలంగాణాలో కౌంటర్ ఇవ్వడానికి వాడుకుందామని అనుకుంటున్నారు.
కేసీఆర్ నిర్విరామ ఉద్యమ ఫలం నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆయన తన శక్తినంతటిని క్రోడీకరించి ప్రత్యేక రాష్ట్రం లక్ష్యంగా శ్రమించి రాష్ట్రాన్ని సాధించాడు. ఈ కాలంలో కేసీఆర్ సైతం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయారు.

Latest Videos

click me!