KCR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా.? కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారా.?

Published : Feb 19, 2025, 05:58 PM IST

చాలా రోజుల పాటు యాక్టివ్‌ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ బయటకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ విస్తృతి స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..   

PREV
15
KCR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా.?  కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారా.?

బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్‌ సొంత పార్టీ నాయకులపై సెటైర్‌తోనే స్పీచ్‌ మొదలు పెట్టారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగాన పార్టీ పని అయిందంటూ కొందర ప్రచారం చేశారని, అయితే అందులో సొంత పార్టీ వాళ్లే ఉండడం దారుణమన్నారు ఇలాటి వ్యాఖ్యల కారణంగానే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని కేసీఆర్‌ అన్నారు. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చిన కేసీఆర్, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 
 

25

ఉప ఎన్నికలు రావడం ఖాయం: 

రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్న గులాబి బాస్‌, ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు రాబోతోందని ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ అంశం గురించి ఇప్పటికే లాయర్లతో మాట్లాడినట్లు తెలిపారు. 
 

35
CM KCR

బీఆర్‌ఎస్‌ ఒక్క ఓటమితో కొట్టుకుపోయేది కాదు: 

బీఆర్‌ఎస్‌ అంటే ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదని, వచ్చే ఎన్నికల్లో వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఒక్క బీఆర్‌ఎస్‌ మాత్రమే పోరాడగలదని, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందన్నారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి అంటూ దిశా నిర్ధేశం చేశారు. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయన్న కేసీఆర్‌, అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 
 

45
KCR, BRS, Telangana

భారీ బహిరంగ సభ: 

ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఉంటాయన్న కేసీఆర్‌ వీటిని ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఇక ఏప్రిల్‌ 27వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ సంస్థాగత కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీలకు ఇంఛార్జిగా హరీష్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. 
 

55

అమెరికాకు కేసీఆర్‌.? 

ఇదిలా ఉంటే కేసీఆర్‌ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికాలో చదువుకుంటున్న మనువడు హిమాన్షుతో కొంతకాలం గడిపేందుకు ఆయన వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే బుధవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్‌ తొలుత సికింద్రాబాద్ పాసపోర్ట్‌ కార్యాలయానికి వెళ్లడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. అక్కడ డిప్లోమేటిక్‌ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్‌ చేసుకున్నారు. అయితే కేసీఆర్‌ అమెరికా పర్యటనపై అధికారిక పర్యటనపై క్లారిటీ రావాల్సి ఉంది. 

click me!

Recommended Stories