Hyderabad : దిగివచ్చిన కూరగాయల ధరలు ... రూ.100 కే బస్తా నిండిపోతుంది

Published : Feb 19, 2025, 07:00 AM IST

హైదరాబాద్ లో కూరగాయల ధరలు కాస్త తగ్గాయి. కొద్దిరోజుల కింద కిలో రూ.100 పైనే వున్న టమాటా, ఉల్లి ధరలతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా తక్కువగానే వున్నాయి. ఏ కూరగాయ ధర ఎంతుందో చూద్దాం.   

PREV
13
Hyderabad : దిగివచ్చిన కూరగాయల ధరలు ... రూ.100 కే బస్తా నిండిపోతుంది
Vegetables price in Hyderabad

Vegetables price in Hyderabad : పట్టణాల్లో సామాన్య మధ్యతరగతి జీవుల బ్రతుకు రోజురోజుకు మరింత బారంగా మారుతోంది... హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే రోజువారి ఇంటి ఖర్చులే తడిసి మోపెడు అవుతున్నాయి. ఇక్కడ ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే... ఇంటి రెంట్ తో పాటు ఇతర ఖర్చులు చాలానే ఉంటాయి. వీటికి తోడు పెరిగిన కూరగాయల ధరలు సామాన్య మధ్యతరగతి వారిని బెంబేలెత్తిస్తుంటాయి.  

అయితే కొద్దిరోజుల వరకు కొండెక్కిన కూరగాయల ధరలు ప్రస్తుతం దిగివచ్చాయి. హైదరాబాద్ లోని అన్ని మార్కెట్లలో చాలా తక్కువ ధరకే కూరగాయలు లభిస్తున్నారు. గతంలో కేవలం కిలో టమాటా రూ.100 పైనే పలికితే ప్రస్తుతం ఈ డబ్బులతో నాలుగైదు రకాల కూరగాయలు వస్తున్నాయి. ఇక ఆకుకూరలయితే మరింత చౌకగా లభిస్తున్నాయి. 
 

23
Vegetables price in Hyderabad

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు  : 

వంటకాలకు రుచినిచ్చేవి కూరగాయలే... వాటి రుచికి అందరూ అలవాటుపడ్డారు. పప్పులు ఉన్నా ఏదో ఒక కూర వంటకాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివి ప్రతి వంటకాల్లో సాధారణంగా ఉపయోగించేవి. ఇలా కూరగాయలు లేకుంటే మన పూట గడవదు. 

అయితే ఇంతకాలం మండిపోయిన కూరగాయల ధరలు ప్రస్తుతం కాస్త కొండ దిగాయి. టమాటా ధర అయితే పూర్తిగా పడిపోయింది. హైదరాబాద్ లో కిలో టమాటా ధర రూ.10 నుండి రూ.15 మాత్రమే ఉంది. ఇక ఉల్లిపాయలు కూడా కిలో రూ.25 నుండి రూ.30 కి వస్తున్నాయి. రూ.100 కిలో నుండి ఇప్పుడు నాలుగైదు కిలోల స్థాయికి ఉల్లి చేరింది. 
 

33
Vegetables price in Hyderabad

ఇతర కూరగాయల ధరలు :

టమాాటా, ఉల్లి మాత్రమే కాదు ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లలో పచ్చిమిర్చి రూ.30, బజ్జి మిర్చి రూ.20, కాకరకాయ రూ.30-40, బీరకాయ రూ.25‌-30 కిలో లభిస్తున్నాయి. 

ఇక బీట్రూట్ రూ.15-20, బీన్స్ రూ.40, చిక్కుడు రూ.30, బంగాళాదుంప రూ.30, క్యారెట్ రూ.20,  క్యాప్సికం రూ.30, ఆలుగడ్డ రూ.25-30, దోసకాయ రూ.30 కి కిలో  లభిస్తున్నాయి.

 మునక్కాయ రూ.100, వంకాయ రూ.30,  అల్లం రూ.50, బెండకాయ రూ.30, గుమ్మడికాయ రూ.25, ముల్లంగి రూ.15,  , పొట్లకాయ రూ.40కి అమ్ముతున్నారు. ఇక మెంతికూర రూ.10 కట్ట, కొత్తిమీర రూ.10 కట్ట, పాలకూర రూ.20 కట్ట లభిస్తున్నాయి. 

గమనిక : హైదరాబాద్ లో చాలా కూరగాయల మార్కెట్లు వున్నాయి. ప్రాంతాన్ని బట్టి కొన్ని కూరగాయల ధరలు మారుతుంటాయి. 
 

click me!

Recommended Stories