కేసీఆర్ కనబడుటలేదు: కరోనా ఆందోళన కొత్త నినాదం ఇదే!

First Published | Jul 9, 2020, 9:49 AM IST

కేసీఆర్ కనబడుట లేదు, కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడం లేదు అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడంలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఏమైపోయారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్లో సిబ్బందికి కరోనా సోకగానే ఫార్మ్ హౌస్ కి కేసీఆర్ ఎందుకు మకాం మార్చారు అంటూ పలువురు నిలదీస్తున్నారు.
undefined
కేసీఆర్ కనబడుట లేదు, కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడం లేదు అంటూ, రాష్ట్రానికి పెద్దదిక్కు కనబడకుండా పోవడం పైపలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
undefined

Latest Videos


నిన్న ఏకంగా ఒక ఇద్దరు యువకులు ప్రగతి భవన్ ముందు ప్లకార్డు పట్టుకొని హల్చల్ చేసారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ, ఆయన కనబడడం లేదు అంటూ హల్చల్ చేసి, పోలీసులు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే తప్పించుకున్నారు.
undefined
ప్రగతి భవన్ ముందుకు కూడా వచ్చి ప్రజలు కేసీఆర్ కనబడడం లేదు అని నినాదిస్తున్నారంటే... తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందొ, ప్రజలు కేసీఆర్ ని ఏ విధంగా మిస్ అవుతున్నారో అర్థమవుతుందని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
undefined
ఇదంతా ఒకెత్తయితే.... కేసీఆర్ కనబడడంలేదంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితుల గురించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ...గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌ బుధవారం హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
undefined
అనంతరం ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ....సీఎం కేసీఆర్‌ కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ఆయన ఆరోగ్య బాగోగులు తెలియచేయాలని కోరారు. ముఖ్యమంత్రికాబట్టి ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు.
undefined
కేసీఆర్‌ కుమారుడు మంత్రి కేటీఆర్‌, కూతురు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ బరిలో నిలిచినకవితకు కూడా రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదంటూ ధ్వజమెత్తారు.బంగారు తెలంగాణ, నిరుద్యోగ భృతి వంటిఅనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయనే ఆందోళన రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ నేపథ్యంలోరాష్ట్ర డీజీపీ, చీఫ్‌ సెక్రెటరీలు జోక్యం చేసుకొని సీఎం కేసీఆర్‌ ఆచూకీ తెలియజేయాలని కోరారు.
undefined
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం పై ఇలా అసత్యప్రచారానికి తెగబడుతుంది ప్రతిపక్షాలే అని తెరాస వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీస్ ఠాణాల్లో కేసులు నమోదు చేస్తుంది ప్రగతి భవన్ వద్ద ప్లకార్డు పట్టుకొని దొరికింది కూడా కాంగ్రెస్ వారే అవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణాలని అంటున్నారు.
undefined
click me!