హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు కేశవనగర్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్ వివరించారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని రాములు యాదవ్ తెలిపారు.