తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

First Published | Jul 11, 2023, 10:31 AM IST

తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ అగ్రనేత సునీల్ బన్సల్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.  వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను కూడ  బీజేపీ సిద్దం  చేసింది. 

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

బీజేపీ తెలంగాణ సహా ఇంచార్జీ  సునీల్ బన్సల్  మూడు రోజులుగా  పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  మంగళవారంనాడు కూడ   బీజేపీ నేతలతో  సునీల్ బన్సల్ కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డి  నియామించిన తర్వాత  పార్టీ నేతలతో సునీల్ బన్సల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరో వైపు  వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను కూడ  బీజేపీ అమలు చేయనుంది.

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

ఈ నెల  9వ తేదీన  దక్షిణాది రాష్ట్రాలకు  చెందిన  బీజేపీ నేతలతో  ఆ పార్టీ  సమావేశం నిర్వహించింది.  11 రాష్ట్రాలకు  చెందిన  బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా   పార్టీ నేతలకు  దిశా నిర్ధేశం  చేశారు.

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

ఈ నెల  9వ తేదీ సాయంత్రం  తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో  జేపీ నడ్డా,  సునీల్ బన్సల్ సమావేశమయ్యారు.  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై  చర్చించారు. భవిష్యత్తుపై  పార్టీ నేతలకు  నేతలు దిశా నిర్ధేశం  చేశారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని  నడ్డా సూచించారు

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

జేపీ నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత నిన్న కూడా  బీజేపీ  నేత సునీల్ బన్సల్  తెలంగాణకు  చెందిన నేతలతో సమావేశమయ్యారు.  ఇవాళ  కూడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు,  జిల్లా అధ్యక్షులతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు,  రానున్న  రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించనున్నారు.

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది.  అయితే ఇటీవల కాలంలో పార్టీలో చోటు  చేసుకున్న పరిణామాలు రాజకీయంగా  ఆ పార్టీకి ఇబ్బంది కల్గించాయి.  మరో వైపు కాంగ్రెస్ కు  రాజకీయంగా కలిసి వచ్చాయనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

బండి సంజయ్ ను   రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడంపై  పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ సాగుతుంది. ఈ తరుణంలో  పార్టీ నేతలతో సునీల్ బన్సల్  వరుస భేటీలు  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లను  దక్కించుకోవడంలో  సునీల్ బన్సల్ కీలకంగా వ్యవహరించారు.  తెలంగాణపై  బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్రీకరించింది.  దరిమిలా సునీల్ బన్సల్ ను  ఆ పార్టీ నాయకత్వం  నియమించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఓటమి పాలైంది.  ఈ పరిణామం  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  ప్రభావం చూపదని  ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే  కర్ణాటక  ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతుంది.  మరో వైపు  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరారు.  ఈ నెలలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  బీజేపీలో అసంతృప్త నేతలు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో రాష్ట్రంలో పరిస్థితులను  చక్కదిద్దేందుకు  బన్సల్ రంగంలోకి దిగారు.

తెలంగాణ నేతలతో బన్సల్ వరుస సమావేశాలు, వంద రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికలకు కమల దళం కసరత్తు

రెండు  రోజులుగా నిర్వహించిన  సమావేశాల్లో  వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను  అమలు చేయాలని ఆ  పార్టీ నాయకత్వం  నిర్ణయం  తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రతి ఇంటికి బీజేపీ అనే ప్రచారంతో వెళ్లాలని పార్టీ నేతలకు  సునీల్ బన్సల్ సూచించారు.  అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను కూడ బీజేపీ నేతలను కలవనున్నారు. మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ అగ్రనేతల బహిరంగ సభలను కూడ నిర్వహించనున్నారు.   బీఆర్ఎస్  ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలపై  కూడ   ఆ పార్టీ నాయకత్వం  కార్యాచరణను సిద్దం  చేయనుంది. ఎస్‌సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడ బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుంది

Latest Videos

click me!